Mercury nakshtra transit: బుధుడు నక్షత్రం మార్చగానే వీరికి అదృష్టం పడుతుంది, సంపద పెరుగుతుంది-mercury nakshtra transit on 29th may these zodiac signs get luck and prosperous ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Nakshtra Transit: బుధుడు నక్షత్రం మార్చగానే వీరికి అదృష్టం పడుతుంది, సంపద పెరుగుతుంది

Mercury nakshtra transit: బుధుడు నక్షత్రం మార్చగానే వీరికి అదృష్టం పడుతుంది, సంపద పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
May 28, 2024 02:12 PM IST

Mercury nakshtra transit: తొమ్మిది రోజుల తర్వాత తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు. భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది.

నక్షత్రం మార్చుకోబోతున్న బుధుడు
నక్షత్రం మార్చుకోబోతున్న బుధుడు

Mercury nakshtra transit: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో రాశి చక్రం మార్పు, నక్షత్ర మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ధృక్ పంచాంగం ప్రకారం సుమారు 8 రోజుల తర్వాత గ్రహాల రాకుమారుడు బుధుడు మే 29 సాయంత్రం భరణి నక్షత్రం నుంచి కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

బుధుడు నక్షత్రం మారిన మరుసటి రోజే తన రాశిని కూడా మార్చుకుంటాడు. ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న బుధుడు మే 31 నుంచి వృషభ రాశి సంచారం చేస్తాడు. రెండు రోజుల వ్యవధిలో బుద్ధుడి డబుల్ కదలిక వల్ల కొంతమంది ప్రయోజనం పొందుతారు. వివేకం, విచక్షణ కలిగి ఉంటారు.

సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం రెట్టింపు అవుతుంది. కెరీర్ లో కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. వ్యాపారం ప్రారంభించేందుకు మంచి సమయం ఇది.

కృత్తిక నక్షత్ర స్వభావం

కృత్తిక నక్షత్రానికి పాలక గ్రహం సూర్యుడు. ఆడంబరాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సంకల్ప బలం ఎక్కువ. మొండి పట్టుదల కలిగి ఉంటారు. నిజాయితీగా ఉండటం వల్ల కొన్ని సార్లు మోసపోయే అవకాశం కూడా ఉంది. విద్య, పని వ్యాపారం ఇలా దేనిలోనైనా తామే ముందుండాలి అనే స్వభావం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. డబ్బు సంపాదించడం కోసం ఎంతటి కష్టమైన అనుభవిస్తారు. అటువంటి iనక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

వృషభ రాశి

బుధుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారి మాటల్లో మాధుర్యాన్ని తీసుకొస్తుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవితంలో శక్తి ఉత్సాహానికి కొదవ ఉండదు. పెట్టుబడులకు ఎన్నో సువర్ణావకాశాలు లభిస్తాయి. ఇతరుల పట్ల మీకున్న ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుని అండగా నిలుస్తుంది. విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంది. సింగిల్స్ ప్రేమలో పడతారు. మీ ప్రేమని వాళ్ళు అంగీకరించే అవకాశం ఉంది.

సింహ రాశి

బుధుడు కృత్తిక నక్షత్రానికి వెళ్ళడం వల్ల సింహ రాశి జాతకుల భవితవ్యం మారుతుంది. జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తోబుట్టువులు ఆస్తి సంబంధించిన సమస్యల నుంచి బయట పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది.

తులా రాశి

బుధుడి సంచారం తులా రాశి వారికికి శుభ ఫలితాలు ఇస్తుంది. కార్యాలయంలో సీనియర్ల సహకారంతో విజయాలు అందుకుంటారు. భాగస్వామితో భావోద్వేగా బంధం బలంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన గొడవలు సద్దుమణుగుతాయి. మీరు మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడి వారిని ఇంప్రెస్ కేహస్తారు. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో మీరు అనుకున్నవి సాధిస్తారు. ఎదుటివారితో ఉన్న గొడవలు సమసిపోతాయి.

WhatsApp channel