Mercury nakshtra transit: బుధుడి నక్షత్ర మార్పు.. ఈ రాశుల వాళ్ళు 9 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి
Mercury nakshtra transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మే 21 నుంచి భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Mercury nakshtra transit: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కొంత సమయం తర్వాత రాశిని, నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వాటి ప్రభావం మానవుల జీవితం మీద తప్పకుండా ఉంటుంది. శుభ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు, అశుభ స్థానంలో ఉంటే కష్టాలు, సమస్యలు పలకరిస్తాయి.
ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. మే 21వ తేదీ అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. మే 29 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. దీని ప్రభావం మేషం నుంచి మీనం వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలు ఇస్తుంది.
భరణి నక్షత్రానికి అధినేత శుక్రుడు. ఇక మే నెలలోనే బుధుడు శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. మే 31 నుంచి బుధుడు వృషభ రాశి సంచారం చేస్తాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం బుధుడు నక్షత్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఈ తొమ్మిది రోజుల పాటు ఏ రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం.
సింహ రాశి
బుధుడి నక్షత్ర మార్పు వల్ల సింహ రాశి వారికి ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కాలంలో డబ్బు లావాదేవీలు చేయకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలు దూరంగా ఉండాలి. ఆస్తి విషయంలో వివాదాలు ఉండవచ్చు. చట్టపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు.
తులా రాశి
బుధుడి నక్షత్రం మార్పు తులా రాశి వారి జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మనసు కకావికలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అన్ని పనులూ అడపాదడపా సాగుతాయి. కష్టపడినా ఫలితం సంతృప్తికరంగా ఉండదు. రాబోయే తొమ్మిది రోజులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. లేకపోతే ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
మకర రాశి
భరణి నక్షత్రంలో బుధుడు ఉండే వరకు మకర రాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు. ఈ సమయంలో ఎవరైనా డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఆర్థిక విషయాలలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. లేకపోతే ధన నష్టం జరగవచ్చు. కొంతమంది జాతకులు సంబంధాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరులతో నెలకొన్న సంబంధాలపై ప్రేమ, నమ్మకం లోపిస్తాయి.
కుంభ రాశి
బుధుడి నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి అసలు అనుకూలంగా లేదు. రాబోయే తొమ్మిది రోజుల్లో మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండమే మంచిది. లేదంటే చిన్న గొడవ కూడా పెద్దదిగా మారి పరిస్థితి చెయ్యి దాటవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో సవాళుతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. మనసు ఆందోళనగా చెందుతుంది. ఈ సమయంలో వ్యాపారులకు నిరాశ ఎదురవుతుంది. ఆకర్షణీయమైన పెట్టుబడి ఆఫర్లు వస్తే వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాలు తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే ధన పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.