Living room vastu tips: లివింగ్ రూమ్ ఇలా ఉందంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది-avoid these simple mistakes in living room as per vastu shastra to better good luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Living Room Vastu Tips: లివింగ్ రూమ్ ఇలా ఉందంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది

Living room vastu tips: లివింగ్ రూమ్ ఇలా ఉందంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
May 29, 2024 03:57 PM IST

Living room vastu tips: ఇంట్లోని ప్రతి గదికి దేనికదే ప్రత్యేకత ఉంటుంది. పడకగది, పూజ గదితో పాటు లివింగ్ రూమ్ కి ప్రాముఖ్యత ఉంది. బయట వాళ్ళు వచ్చినా ముందుగా ఈ గదిలోకి వస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బలపడటంలో ఈ గది కీలక పాత్ర పోషిస్తుంది.

లివింగ్ రూమ్ వాస్తు నియమాలు
లివింగ్ రూమ్ వాస్తు నియమాలు (pixabay)

Living room vastu tips: ఇంటికి ఎవరైనా రాగానే ముందుగా లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటారు. అందుకే ఈ రూమ్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఒక చోటుకు చేర్చే గది ఇదే.

లివింగ్ రూమ్ లో కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడుపుతారు. అంతా ఒక చోట చేరి ఆనందంగా ఉంటారు. అటువంటి ముఖ్యమైన లివింగ్ రూమ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .వాస్తు ప్రకారం లివింగ్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అందులో ఉంచే వస్తువులు క్రమ పద్ధతిలో ఉంచాలి. లివింగ్ రూమ్ రంగు, చేపల అక్వేరియంతో పాటు అనేక వస్తువులు ఇంటి ఆనందం శ్రేయస్సుకు కారణం అవుతాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం లివింగ్ రూమ్ ని అందంగా అలంకరించడం వల్ల సంపద, సంతోషం, అదృష్టం పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. సంపదకు కొత్త మార్గాలు ఏర్పడతాయి . ఇంట్లోని నెగెటివిటీని వదిలించుకోవచ్చు.

లివింగ్ రూమ్ కి సంబంధించిన వాస్తు చిట్కాలు

వాస్తు ప్రకారం లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం దక్షిణ దిశలో ఉండకూడదు. ఇది కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఈ గదిలో ఉండే ఫర్నిచర్ ఇతర బరువైన వస్తువులు పడమర లేదా దక్షిణ దిశలోనే ఉంచాలి.

చాలామంది లివింగ్ రూమ్ మధ్యలో షాండ్లియర్ ను వేలాడదీస్తారు. అయితే వాస్తు ప్రకారం దీనిని దక్షిణ లేదా పడమర దిశలో ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఇంటి సంపద, సౌభాగ్యం పెరుగుతుంది.

లివింగ్ రూమ్ లోని గోడలకు తెలుపు, లేత నీలం, పసుపు లేదా ఆకుపచ్చ రంగులు వేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేసుకోవడం కోసం లివింగ్ రూమ్ కి నీలం రంగు ఉపయోగించుకోవచ్చు. సంబంధాలను మెరుగుపరిచే ఈ ప్రదేశంగా లివింగ్ రూమ్ ని పరిగణిస్తారు.

కిటికీలు ఎక్కువగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు .ఇవి పాజిటివ్ ఎనర్జీ ప్రసరింపచేస్తాయి. అది మాత్రమే కాకుండా ఇది ఇతర గదుల మాదిరిగా ఉండకూడదు పెద్దదిగా ఉండాలి. ఈ గదిలో దుఃఖాన్ని, బాధని చూపించేటువంటి చిత్రపటాలు ఉంచుకోకూడదు. అవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి.

లివింగ్ రూమ్ లో చేపల అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో రెండు బంగారు రంగు చేపలు ఉంచితే మరీ మంచిది. ఇది ఇంట్లో సంతోషం, శాంతిని ఉంచుతుందని నమ్ముతారు. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచుకోవచ్చు.

లివింగ్ రూమ్ లో క్యాక్టస్, ఎండిన పువ్వులు, కృత్రిమ పువ్వులు ఉంచకూడదు. దీని వల్ల డబ్బు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉదయించే సూర్యుడు, ఏడు గుర్రాల చిత్రపటాన్ని లివింగ్ రూమ్ లో ఉంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే కిటికీలు ఎప్పుడూ మూసి ఉంచకూడదు.

నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి దూరంగా పారద్రోలేందుకు ప్రతిరోజు సాయంత్రం ఒక మట్టి దీపం వెలిగించాలి. ఖాళీ గోడకు ఎదురుగా ఎప్పుడూ కూర్చోకూడదు. ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

WhatsApp channel

టాపిక్