Aparajita flowers: ఈ ఒక్క పూల మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు డబ్బు కొరత ఉండదు.. సంపద, కీర్తి లభిస్తుంది
Aparajita flowers: నీలం రంగు అపరాజిత పువ్వుల మొక్కను ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు కొరత ఉండదు. సంపద, కీర్తి లభిస్తాయి. ఈ పూలను పూజలో ఉపయోగిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి.
Aparajita flowers: అందరూ క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడేది డబ్బు కోసమే. ఎంత కష్టపడినా కొంతమంది చేతిలో డబ్బులు నిలవవు. అందుకు కొన్ని సార్లు నిర్లక్ష్యం, అధిక ఖర్చులు కారణమయితే మరికొన్ని సార్లు గ్రహ దోషాలు, వాస్తు దోషాలు కూడా కారణం అవుతాయి.
డబ్బుకు సంబంధించి సమస్యలను అధిగమించేందుకు వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పరంగా అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ పువ్వు మొక్క ఇంట్లో నాటడం. అదే అపరాజిత పుష్పం. దీన్నే శంఖు పువ్వు, విష్ణుకాంత పువ్వు అని కూడా పిలుస్తారు. అపరాజిత మొక్క ఇంట్లో ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
పువ్వులు లేకుండా పూజ అసంపూర్తిగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సంపదతో నిండిపోతుంది. పూజలో అపరాజిత పువ్వులు పెట్టడం శ్రేయస్కరం. అలాగే ఇంట్లో ఈ మొక్క పెట్టుకునా పురోగతి సాధిస్తారు. ఈ పువ్వును జ్యోతిష్య పరిహారాలలో కూడా ఉపయోగిస్తారు. విష్ణుమూర్తి, శనీశ్వరుడికి శంఖు పూలంటే మహా ప్రీతి. ఈ పువ్వుకు సంబంధించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సు నిలుస్తాయి. డబ్బు ఇంట్లో నిలుస్తుంది.
శని దేవుడికి సమర్పించడం
శని దేవుడికి నీలం రంగు కలిగిన అపరాజిత పూలను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. శనివారం శనీశ్వరుడికి అపరాజిత పూలతో చేసిన పూల దండ సమర్పించాలి. ఇలా చేస్తే శని దేవుడి సంతోషించి మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడు.
డబ్బు కొరత తీరుతుంది
డబ్బులు నిల్వ చేసే ప్రదేశంలో శంఖు పూలను పెట్టడం వల్ల డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పూలు నీలం, తెలుపు రంగుల్లో లభిస్తాయి. నీలం రంగు పుష్పాలు ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం హనుమంతుడి ఆరాధనలో అపరాజిత పూలు పెట్టాలి. ఆ తర్వాత వాటిని మీ పర్స్ లేదా డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు కొరత తీరుతుంది.
శివలింగానికి సమర్పించడం
సోమవారం శివలింగానికి పూజ చేసేటప్పుడుశంఖు పూలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహం పొందుతారు. అది మాత్రమే కాకుండా సోమవారం నాడు పారే నీటిలో లేదా నదిలో ఐదు అపరాజిత పువ్వులు వేయాలి. ఇలా చేసినా కూడా డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి.
వ్యాపారంలో నష్టాన్ని అధిగమించేందుకు
వ్యాపారంలో నష్టం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంటే అపరాజిత పూలతో ఈ పరిహారం పాటించి చూడండి. ఏడు శంఖు పూలను తీసుకుని గంగా జలంతో కడిగి పసుపు వస్త్రంలో పెట్టాలి. వాటిని మీరు వ్యాపారం చేస్తే షాపు లేదా డబ్బు పెట్టెలో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే వ్యాపార నష్టాల నుంచి బయట పడొచ్చు.
కోరికలు తీరతాయి
చాలా కాలంగా మీ కోరికలు నెరవేర్చుకోలేకపోతున్నట్టయితే అపరాజిత పూలను హనుమంతుడి పాదాల వద్ద సమర్పించి పూజ చేయండి. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీ కోరిక నెరవేరుతుంది. అలాగే దుర్గామాత, శివుడు, విష్ణు మూర్తికి ఈ పూలతో చేసిన దండ సమర్పించవచ్చు. ఈ పూలను కొన్నింటిని మీ ఇంటి మూలలో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదు.
టాపిక్