Aparajita Plant Flower । భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అపరాజిత పుష్పం!-have aparajita plant flower and get devotional medicinal and vastu benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Have Aparajita Plant Flower And Get Devotional, Medicinal And Vastu Benefits

Aparajita Plant Flower । భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అపరాజిత పుష్పం!

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 05:16 PM IST

Aparajita Plant Flower: అపరాజిత పుష్పంతో భగవంతున్ని పూజిస్తే ఐశ్వర్య వృద్ధి, లక్ష్మీ కటాక్షం కలుగుతాయి, శని వక్ర దృష్టి తగ్గుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు, వాస్తు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Aparajita Plant Flower: అపరాజిత పుష్పం
Aparajita Plant Flower: అపరాజిత పుష్పం (Stock pic)

నీలం అపరాజితా పుష్పం ఎంతో విశేషమైనది. హిందూ మతంలో అపరాజిత పుష్పంను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. దీనిని స్వయంగా దుర్గామాత అవతారంగా కూడా భావిస్తారు. ఈ పుష్పం ఆధ్యాత్మిక, వాస్తు ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందింది. భగవంతుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా నీలం అపరాజితా పుష్పంను పరిగణిస్తారు. ఈ పువ్వును ప్రతి రోజూ పూజలో ఉపయోగిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

ట్రెండింగ్ వార్తలు

అపరాజిత పుష్పం (Aparajita Flower) అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం. ఈ పువ్వును సమర్పించడం ద్వారా విష్ణువు సంతోషిస్తాడు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో అపరాజిత పుష్పం నాటడం ద్వారా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ప్రసన్నులవుతారు. అందుకే ఈ పువ్వును దీనిని విష్ణుప్రియ అని కూడా అంటారు.

శివుడికి కూడా అపరాజిత పుష్పం అంటే చాలా ఇష్టం. అపరాజిత పుష్పాలను శివునికి సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది.

ఈ పుష్పాన్ని సమర్పించడం ద్వారా శని దేవుడు కూడా సంతోషిస్తాడు. శని నుంచి పరిహారం లభించడానికి శనేశ్వరునికి నీలం అపరాజిత పుష్పాలని సమర్పించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

వాస్తు పరంగా అపరాజిత పుష్పం ప్రాముఖ్యత

  • అపరాజిత పుష్పం వాస్తు పరంగా కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉంది. సాధారణంగా అపరాజిత మొక్క తెలుపు, నీలం పుష్పాలను అందిస్తుంది. అయితే నీలిరంగు అపరాజితా పుష్పాన్ని ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
  • ఇంటి ఆవరణలో అపరాజిత మొక్క ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతారు. ఏ విధంగానూ డబ్బుకు కొరత ఉండదని నమ్ముతారు.
  • ఈ చెట్టును ఇంటి ఈశాన్య భాగంలో నాటాలి. గురువారం, శుక్రవారం ఈ మొక్కనాటడానికి మంచి రోజులు. ఈ మొక్కకు పూచిన పువ్వులను పూజకు ఉపయోగించాలి. తద్వారా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
  • ప్రతి సోమ, శనివారాల్లో 3 అపరాజిత పుష్పాలను పారే నీటిలో వేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.

అపరాజిత మొక్క - అపురూపమైన ఔషధం

- అపరాజిత మొక్క ఒక ఔషధ మూలిక కూడా. దీని శాస్త్రీయ నామం క్లిటోరియా టెర్నేటియా (Clitoria ternatea), సాధారణంగా శంఖుపూలు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ మొక్క ద్వారా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

- 10 గ్రాముల అపరాజిత ఆకులను 500 మి.లీ నీటిలో మరిగించాలి. అనంతరం నీటిని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన నీటితో నోటిని గరగరలాడించడం, పుక్కిలించడం ద్వారా టాన్సిల్స్, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందువచ్చు.

- అపరాజిత మొక్క వేరును పొడి చేసి ఆవు పాలు, ఆవు నెయ్యి కలిపి తింటే కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.

- ఒక కప్పు నీటిని వేడిచేసి అందులో 10 ఎండబెట్టిన అపరాజిత పువ్వులను వేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి.

- ఈ పువ్వులలోని నీలి వర్ణద్రవ్యం అంతా నీటిలోకి చేరి ఆ నీరంతా నీలిరంగులోకి మారుతుంది. దీనిని బ్లూటీ లేదా Butterfly Tea కూడా అంటారు. ఇందులో తేనె కలుపుకొని గోరువెచ్చగా తాగండి.

- ఇది కెఫిన్ లేని ఒక ఆయుర్వేద మూలికా ద్రావణం. దీని ఒక కప్పు టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్ గా అనిపిస్తుంది, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, మూత్రం సజావుగా వస్తుంది, మలినాలను తొలగిస్తుంది, రక్తంలో గ్లూకోజు స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్