Love marriage: ప్రేమ పెళ్ళిలో కష్టాలు తీసుకొచ్చే గ్రహాలు ఇవే.. ఈ పరిహారాలు పాటిస్తే లైఫ్ ఖుషీ-these are the planets that bring difficulties in love marriage life will be happy if these remedies are followed ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Love Marriage: ప్రేమ పెళ్ళిలో కష్టాలు తీసుకొచ్చే గ్రహాలు ఇవే.. ఈ పరిహారాలు పాటిస్తే లైఫ్ ఖుషీ

Love marriage: ప్రేమ పెళ్ళిలో కష్టాలు తీసుకొచ్చే గ్రహాలు ఇవే.. ఈ పరిహారాలు పాటిస్తే లైఫ్ ఖుషీ

Gunti Soundarya HT Telugu
May 18, 2024 12:44 PM IST

Love marriage: కొంతమంది ఎన్నో కలలు కంటూ ప్రేమ పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళ కలలు చెదిరిపోవడానికి ఎంతో కాలం పట్టదు. అందుకు కారణం కొన్ని స్వయంకృతాపరాధాలు అయితే మరికొన్ని గ్రహాల అశుభ ప్రభావం వల్ల కూడా కావచ్చు.

ప్రేమ పెళ్ళిలో కష్టాలు తెచ్చే గ్రహాలు ఇవే
ప్రేమ పెళ్ళిలో కష్టాలు తెచ్చే గ్రహాలు ఇవే (pixabay)

Love marriage: ప్రతి వ్యక్తి తమ వివాహ బంధాన్ని అందంగా ప్రత్యేకంగా మార్చుకోవాలని కోరుకుంటారు. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అన్ని గండాలు  దాటుకొని వివాహం చేసుకుని తమ కల నెరవేర్చుకుంటారు. 

అలా చేసుకున్న వాళ్ళ జీవితం కొద్ది రోజులకే సమస్యగా మారుతుంది. ఇద్దరి మధ్య అవగాహన లోపంతో పాటు కొన్ని కారణాల వల్ల పెళ్లి తర్వాత కూడా చాలా సమస్యలు మొదలవుతాయి. పెళ్లయ్యాక వారి వైవాహిక జీవితంలో టెన్షన్ పెరుగుతుంది. అందుకు కారణం జాతకంలో కొన్ని గ్రహాల అశుభ ప్రభావం కూడా కావచ్చు. ఇది ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు విడిపోయే స్థాయికి కూడా చేరుస్తుంది.

నాలుగు గ్రహాలు ఏవంటే.. 

జ్యోతిషశాస్త్ర ప్రకారం ప్రేమ వివాహాలు విజయవంతం కాకపోవడానికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కలిగేందుకు నాలుగు గ్రహాలు ప్రతికూల పాత్ర పోషిస్తాయి. శుక్రుడు, బృహస్పతి, రాహువు, బుధ గ్రహాలు జాతకంలో బలహీన స్థానంలో ఉంటే వారి ప్రేమ వివాహంలో వివిధ సమస్యలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించుకునేందుకు ప్రేమ వివాహాన్ని చెక్కుచెదరకుండా రక్షించుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఆకర్షణ, సంపద, అదృష్టం, ప్రేమ వంటి వాటికి  కారకుడు శుక్రుడు. అటువంటి శుక్రుడు స్థానం బలహీనంగా ఉంటే దంపతుల మధ్య ఆకర్షణ తగ్గుతుంది. మతం, తత్వశాస్త్రం, పిల్లలకు బాధ్యత వహించే గ్రహం బృహస్పతి. ఇది బలహీన ప్రదేశంలో ఉంటే ఆ వ్యక్తి ఆనందాన్ని పొందాలనే కోరిక ఉండదు. అలాంటి జీవితంలో ప్రేమ, శృంగారం తగ్గిపోతాయి. ఫలితంగా జంట మధ్య తగాదాలు, వాదనలు ప్రారంభమవుతాయి.

బుధ గ్రహం ప్రసంగం, చర్మం మొదలైన వాటికి బాధ్యత వహిస్తుంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే వ్యక్తులు కఠినమైన మాటలతో ఇతరులను బాధపెడతారు. జీవిత భాగస్వామి దూరం కావడానికి ఒక చిన్నమాట చాలు. దీని వల్ల  మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాహువు అశుభ స్థానంలో ఉంటే  వైవాహిక జీవితంలో గందరగోళానికి దారితీస్తుంది. భాగస్వామ్యంలో ఒకరినొకరు అనుమానించుకోవడం ప్రారంభిస్తారు. ఇదే గొడవలకు దారితీస్తుంది.  దాంతోపాటు జాతకంలో ఐదు, ఏడో ఇల్లు బలహీనంగా ఉంటే ప్రేమ వివాహాలు విఫలమై విడాకులకు దారి తీసే ప్రమాదం పెరుగుతుంది. వాటి నుంచి బయట పడేందుకు ఈ పరిహారాలు పాటిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. 

మూడు నెలలు ఇలా చేయాలి 

వివాహ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకు మూడు నెలల పాటు ఈ పనులు చేయండి. మీ జీవితం సంతోషంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమ వివాహంలో ఇబ్బందులు ఉన్నట్లయితే బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల అలా అవుతుంది. అందువల్ల ప్రతి గురువారం కనీసం మూడు నెలల పాటు బృహస్పతి లేదా శివాలయాన్ని సందర్శించాలి. పసుపు బట్టలు,  శనగపప్పు, పసుపు రంగు పాలు వంటివి ప్రసాదంగా తీసుకోవాలి. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. 

అరటి చెట్టుకు పూజ

ప్రేమ వివాహం చేసుకుని తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ప్రతి గురువారం అరటి చెట్టుకు పూజ చేయాలి. బృహస్పతి భగవానుడు కథ వినాలి, చదవాలి. గురువారం నాడు పసుపు లేదా కుంకుమ తిలకం పెట్టుకోవాలి. ఇది ప్రేమ వివాహం సజావుగా ఉండేలా చేస్తుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యలను తగ్గుతాయి. పరస్పర ప్రేమ పెరుగుతుంది.

గోమేధికం రత్నం ధరించాలి

జాతకంలో రాహువు, శుక్రుడు, చంద్రుడు అశుభస్థానంలో ఉంటే వాటి చెడు ప్రభావాలను నివారించేందుకు సిలోన్ గోమేడ్( గోమేధికం రత్నం) అనే రత్నాన్ని ధరించాలి. బుధవారం నాడు ఈ రాయిని వెండి ఉంగరంతో జత చేసి ధరించడం వల్ల జీవితంలోని వివిధ రంగాల్లో విజయం సాధిస్తారు. వివాహ జీవితంలో ప్రేమ ఉంటుంది. సంబంధం మరింత బలంగా మారుతుంది. 

దుర్గా చాలీసా పఠించాలి

ప్రేమ వివాహంలో ఇబ్బందులు ఎదురవుతుంటే దుర్గామాత 108 నామాలను రెండుసార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాక సుందరాకాండ కూడా పఠించాలి. ఇలా చేస్తే దంపతుల మధ్య విడదీయరాని ప్రేమ ఏర్పడుతుంది. ప్రతిరోజు దుర్గా చాలీసా కూడా పఠించాలి. 

సూర్యుడికి నీటిని సమర్పించాలి

వైవాహిక జీవితం ప్రేమతో కొనసాగేలా చేయడం కోసం ప్రతి ఉదయం సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఈ కాలంలో గాయత్రీ మంత్రాన్ని కూడా జపించాలి. పౌర్ణమి, గురువారం ఉపవాసం పాటించాలి. శుక్రవారం చిన్నారులకు ఖీర్ అందించాలి. ఇలా చేస్తే ఆ దంపతుల మధ్య ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు. 

శుక్రవారం పరిహారాలు

జాతకంలో శుక్రుడు స్థానం అశుభంగా ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు చెలరేగుతాయి. అటువంటి వాటిని తగ్గించుకోవడం కోసం శుక్రవారం పూట మట్టి దీపాన్ని తీసుకొని అందులో రెండు కర్పూరం వేసి దీపం వెలిగించాలి. ఆ దీపం పొగ ఇంటి మొత్తం వచ్చేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం మీద పడిన చెడు దృష్టి తొలగిపోతుంది. సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది. 

 

WhatsApp channel