Shani devudu: ఈ అలవాట్లు శని దేవుడికి నచ్చనే నచ్చవు.. వీటిని మానుకుంటే అంతా మంచే జరుగుతుంది
Shani devudu: శని అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా రాజు కాగలడని అంటారు. అందుకే మంచి పనులు చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. కానీ ఈ అలవాట్లు శని దేవుడికి అసలు నచ్చవు. అవి ఏంటో తెలుసా?
Shani devudu: శనిని న్యాయాధిపతి అంటారు. అందుకే ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతారు. శని శిక్షలు మాత్రమే వేస్తాడని అననుకూల ఫలితాలు ఇస్తుందని అందరూ భావిస్తారు. కానీ మనం చేసే పనుల ఆధారంగా ఫలితాలు అందిస్తాడు. మన కర్మలన్నింటికీ లెక్కలు చెప్పేవాడు శని దేవుడు.
అదృష్టాన్ని కూడా కలిగించే దేవుడి కనుక అదృష్ట దాత అని కూడా పిలుస్తారు. శనిగ్రహం చెడు దృష్టి ఎవరిపైనైనా పడినట్లయితే, వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వారి జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆత్మగౌరవం దెబ్బతింటుంది, కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. శనీశ్వరుడి ఆశీర్వాదం పొందినట్లయితే, వారి జీవితం ఉత్తమ మలుపు తీసుకుంటుంది. ఆనందం,ఆదాయం రెండూ పెరుగుతాయి.
వేద జ్యోతిషశాస్త్రంలో, శనిని న్యాయానికి అధిపతిగా పిలుస్తారు. శని భగవానుడి స్థానం జన్మ చార్ట్‌లో డబ్బు స్థానాన్ని నిర్ణయిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో శని వయస్సు, దుఃఖం, వ్యాధి, నొప్పి, సాంకేతికత, ఇనుము, సేవకుడు, రాజు, పేద, జైలు మొదలైన వాటికి సంబంధించిన గ్రహం. ఇది మకరం, కుంభరాశిని పాలిస్తుంది. ఈ అలవాట్లు ఉంటే శని అనుగ్రహం పొందలేరు. అందుకే మీకు ఈ అలవాట్లు ఉంటే వాటిని మానుకోవడం మంచిది.
పెద్దలతో తప్పుగా ప్రవర్తించడం
పెద్దలను లేదా తల్లిదండ్రుల పట్ల తప్పుగా ప్రవర్తించడం, అగౌరవపరచడం శని దేవుడికి అసలు ఇష్టం ఉండదు. ఫలితంగా వారికి సమాజంలో గౌరవం తగ్గుతుంది. ఆర్థికంగా బలహీనపడతారు. సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శని దేవుడికి ఇష్టం లేని ఈ పని చేయడం మానుకోవాలి. అప్పుడే శని ఆశీస్సులు లభిస్తాయి.
బూట్లు, చెప్పులు సౌండ్ చేస్తూ నడవడం
కొంతమంది వ్యక్తులు నడుస్తున్నప్పుడు చెప్పులు లేదా బూట్లు రుద్దడం అలవాటు చేసుకుంటారు. వాటి వల్ల వచ్చే సౌండ్ చాలా చిరాకుగా ఉంటుంది. మనం నడిచేటప్పుడు మన పాదరక్షలను రుద్దడం వల్ల శనిదేవుడు కలత చెందుతాడు. శనిగ్రహ కోపాన్ని ఆ వ్యక్తి ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు. వెంటనే ఈ అలవాటు ఉంటే విడిచిపెట్టడం మంచిది లేదంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితాంతం అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాళ్ళు ఊపడం చేయకూడదు
చాలా మంది వ్యక్తులు కుర్చీ లేదా మంచం మీద కూర్చున్నప్పుడు వారి కాళ్ళను ఊపుతూ ఉంటారు. అలా చేయకూడదని ఇంట్లో పెద్దలు వారిస్తారు. ఇది మంచి అలవాటుగా పరిగణించరు. ఇలాంటి అలవాట్లు శని దేవుడికి నచ్చవని అంటారు. ఈ అలవాటు అనుసరించడం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మీకు ఈ అలవాటు ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోండి.
అప్పులు ఎగ్గొట్టకూడదు
కొంతమంది డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తారు. అలాంటి వ్యక్తులను శని దేవుడు అస్సలు మెచ్చుకోడు అని నమ్ముతారు. అలా చేస్తే ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. డబ్బు కొరత కారణంగా వారి జీవితంలో ఇబ్బందుల్లో ఉంటారు. ఎవరి నుండి అయినా డబ్బును అప్పుగా తీసుకుంటే మీరు దానిని నిర్ణీత సమయంలో వారికి తిరిగి ఇవ్వాలి. లేకుంటే మీరు మీ జీవితాంతం దాని మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది.
వంటగదిని మురికిగా ఉంచవద్దు
శని అశుభ ప్రభావాలు ఎదుర్కోకుండా ఉండాలంటే బాత్ రూమ్, వంటగది పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి. బాత్ రూమ్ ఎప్పుడూ తడిగా ఉండకూడదు. రాత్రి కిచెన్ శుభ్రం చేసుకుని ఉండాలి. లేదంటే ఇల్లు ప్రతికూల శక్తులు ఇబ్బంది పెడతాయని చెబుతారు. అందుకే ఈ అలవాటు మంచిది కాదు.
శని అనుగ్రహం పొందే పరిహారాలు
శనిగ్రహం చెడు దృష్టిని నివారించడానికి హనుమాన్ చాలీసా పఠించండి. నువ్వులు, నూనె దానం చేయాలి. ఏడు ముఖ రుద్రాక్ష మాల ధరించడం మంచిది. శనిగ్రహం కోపాన్ని నివారించడానికి "ఓం ప్రాణ్ ప్రిన్ ప్రాణ్ స శనైశ్చరయే నమః" అనే శని బీజ్ మంత్రాన్ని జపించండి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.