Foot Wear Rules : ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఏమవుతుందో తెలుసా?
చాలామంది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతారు. స్టైల్ గా ఉండే ఫ్లిప్స్ వేసుకుని ఉంటున్నారు. అసలు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగొచ్చా?
కాళ్ళకి వేసుకునే చెప్పులు ఇంటి గుమ్మం బయట విడిచి రావాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంటికి బంధువులు అయితే గుమ్మం ముందు, అదే బయట వాళ్ళు గేటు బయట చెప్పులు విడవాలని అంటారు. కానీ ఇప్పుడు కొంతమంది ఇంట్లోనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.
ఆరోగ్య సమస్యలు ఉన్న పెద్దవాళ్ళు చెప్పులు లేకుండా నడవకూడదని వైద్యులు సలహా ఇవ్వడంతో వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం ఫ్యాషన్ గా మారిపోయింది. నిజానికి ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగొచ్చా? అది ఇంటికి మేలు చేస్తుందా? అంటే ఒక్కొక్కరి వాదన ఒక్కో విధంగా ఉంటుంది.
బూట్లు వద్దు
బయటకి వెళ్లేందుకు ధరించే బూట్లు లేదా చెప్పులు ఎప్పుడు ఇంట్లోకి వేసుకుని రాకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల బయట మురికితో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
చిందరవందరగా పడేయొద్దు
ఇంటి గుమ్మం ముందు చెప్పులు చిందరవందరగా ఉంచేస్తారు. వాస్తు ప్రకారం పాదరక్షలు అలా ఇల్లు మొత్తం ఉంటే దోషంగా పరిగణిస్తారు. చెప్పులు క్రమపద్ధతిలో ఉంచని ఇంట్లో శని ఎప్పుడు ఉంటుందని నమ్ముతారు. అలాంటి ఇళ్ళలో ఎప్పుడు మానసికపరమైన ఇబ్బందులు, ఏవైనా పనులు తలపెడితే అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి.
పాదరక్షలు ఈ దిశలో ఉండాలి
వాస్తు ప్రకారం పాదరక్షలు ఎప్పుడు పడమర దిశలో ఉండాలి. అప్పుడే ఇంటికి మేలు జరుగుతుంది. చెప్పులు, బూట్లు మెట్ల కింద ఉంచకూడదు. ఇంట్లోకి వెళ్లేటప్పుడు గుమ్మం దగ్గర పాదరక్షలు తీసేసి వెళ్ళడం మరచిపోవద్దు.
శని దోషం
మీరు కొనుగోలు చేసిన బూట్లు లేదా చెప్పులు త్వరగా పాడైపోతున్నాయా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు మీకు అశుభ ఫలితాలు ఇస్తున్నాడని సంకేతం. విరిగిన లేదా తెగిపోయిన బూట్లు ఉంటే వాటిని ఇంట్లో నుంచి త్వరగా తీసేయాలి.
చెప్పులు వేసుకోవడం మంచిది కాదా?
నేల మీద పాదాలు తగులుతూ నడవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ కాలం పాటు చెప్పులు వేసుకుని నడవటం వల్ల కాళ్ళు సున్నితంగా మారిపోతాయి. వాటిని తీసి నడవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రోజులో కొద్ది సేపు అయినా చెప్పులు లేకుండా నడవడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
అరికాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవకూడదని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు చెప్పులు ధరించే ఇంట్లో ఉండవచ్చు.
ఈ ప్రదేశాల్లోకి చెప్పులతో వెళ్లకూడదు
పవిత్రమైన ప్రార్థనా స్థలాలు, దేవాలయాలం లోపలికి వెళ్లేటప్పుడు పాదరక్షలు బయట వదిలేసి వెళతారు. అది మాత్రమే కాదు ఇంట్లో కూడా పూజ గది, వంట గది, డబ్బులు ఉండే ప్రదేశంలో కూడా చెప్పులు లేకుండా నడవాలి.
డబ్బులు ఉన్న దగ్గరకి చెప్పులు ధరించి వెళ్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి అవాల్సి వస్తుందని అంటారు. దాని వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వంట గదిలో కూడా బూట్లు లేదా చెప్పులు వేసుకుని తిరగకూడదు. ఇలా చేస్తే తల్లి అన్నపూర్ణకి కోపం వచ్చి జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
టాపిక్