Goddess lakshmi devi: మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే-goddess lakshmi devi idol vastu tips and avoid these mistakes ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi: మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Goddess lakshmi devi: మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Gunti Soundarya HT Telugu
Jun 11, 2024 09:22 AM IST

Goddess lakshmi devi: లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి, ఏ దిశలో ఉంచాలి అనే విషయాల గురించి తెలుసుకోవాలి.

లక్ష్మీదేవి విగ్రహ నియమాలు
లక్ష్మీదేవి విగ్రహ నియమాలు

Goddess lakshmi devi: ఇంట్లో సానుకూల శక్తిని పెంచేందుకు, ప్రతికూల శక్తిని తొలగించేందుకు వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుళ్ళు, దేవతల విగ్రహాలను సరైన దిశలో పెట్టుకోరు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరించడానికి కారణమవుతుంది. లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సుఖసంతోషాలకు కొదవ ఉండదని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచడం ఉత్తమమో తెలుసుకుందాం.

ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు?

లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదు . అలా ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. సాధారణంగా చాలా ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద ఉంచుతారు. కానీ వినాయకుడి దగ్గర మాత్రమే ఉంచాల్సిన అవసరం లేదు. అమ్మ వారి విగ్రహాన్ని విష్ణువు, కుబేరుడి వద్ద కూడా పెట్టుకోవచ్చు. కుడివైపున వినాయకుడితో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుతారు. అలాగే విష్ణుమూర్తికి ఎడమవైపు లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు.

ఏ దిశలో ఉంచాలి?

లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు ఇంటి పూజ గదిలోనే ఏర్పాటు చేయాలి. అమ్మవారి విగ్రహాన్ని నేలపై ఎప్పుడూ ఉంచకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇంట్లో పూజ గది లేకపోతే టేబుల్ ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే వాయువ్యదిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇలాంటిది ఉంచకూడదు

లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకునే ముందు తప్పనిసరిగా ఈ విషయం గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ కమలంపై కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో విగ్రహాన్ని తీసుకోకూడదు. అలాగే పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు.

ఇది దానం చేయండి

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకి ఇష్టమైన వస్తువులు దానం చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కమలం, శంఖం, పూలు, గోరి మొదలైన వాటిని దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక పురోగతి లభిస్తుంది.

లక్ష్మీదేవికి ఇష్టమైన ఇవి తెచ్చుకోవచ్చు

లక్ష్మీ చంచలమైనదని చెబుతారు. అందుకే లక్ష్మీదేవి ఇంట్లో ఉండేందుకు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చి పెట్టుకోవడం, వాటిని పూజించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీటిలో మొదటిది కమలం. లక్ష్మీదేవి కమలంలో నివసిస్తుందని విషయం అందరికీ తెలిసిందే. అందుకే పూజలో తామర పువ్వులు ఉంచుతారు. పద్మిని పద్మప్రియ వంటి పేర్లు లక్ష్మీదేవికి ఉన్నాయి. అందుకే ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి పూజలో తామర పువ్వులు ఉంచాలి.

లక్ష్మీదేవి ఆవు వీపుపై కూడా నివసిస్తుందని చెబుతారు. హిందూ మతంలో గోమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. గోవులకు ఆహారం పెట్టి వాటిని సేవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. చాలా చోట్ల లక్ష్మీ పూజగా పసుపు కుంకుమలను ఆవు వీపుపై రాస్తారు. గురువారం గోమాతకు పిండి తినిపిస్తారు.

లక్ష్మీదేవి నివాసంగా ఏనుగును కూడా చెబుతారు. లక్ష్మీదేవి ఏనుగు తలపై కూర్చుంటుందని అంటారు. ఏనుగుని చూడటం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. గజలక్ష్మి కూడా లక్ష్మీదేవి స్వరూపమే.

ఇక చివరిగా మన చేతుల్లోనూ లక్ష్మీదేవి ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచి అరచేతులను చూసి నుదుటిపై పెట్టుకుంటే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని చెబుతారు. అలాగే బిల్వపత్రంలోనూ లక్ష్మీదేవిని నివసిస్తుందని అంటారు .అందుకే లక్ష్మీదేవి ఆరాధనలో బిల్వపత్రం ఉంచాలని చెబుతారు.

Whats_app_banner