Thursday remedies: మీ పేదరికం తొలగిపోవాలా? అయితే గురువారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
Thursday remedies: మీ పేదరికం తొలగిపోయి సంపద పెరగాళా? అయితే గురువారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. అప్పుడే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. బృహస్పతి స్థానం బలపడుతుంది. అవి ఏంటో తెలుసుకుందాం.
గురువారం నారాయణుడి రోజుగా భావిస్తారు. ఈరోజు శ్రీహరి విష్ణువుని ప్రత్యేకంగా పూజిస్తారు. గురువారం భగవంతుని ధ్యానం చేస్తే జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. అదే సమయంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు గురువారం విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని కూడా పూజిస్తారు. అలా చేస్తే ఇంట్లో పేదరికం తొలగిపోయి సుఖసంతోషాలు వస్తాయి.
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
గురువారం రోజు తెలుసో తెలియకో చేసే కొన్ని పనుల వల్ల విష్ణువుకు కోపం వస్తుందని ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని పురాణాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాకుండా మనం చేసే కొన్ని పొరపాట్లు బృహస్పతి గ్రహాన్ని బలహీన పరుస్తాయి. అందుకే గురువారం ఏం చేయకూడదు, బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేసి మార్గాలు ఏంటో తెలుసుకుందాం.
బూజు దులపకూడదు
కొన్ని నమ్మకాల ప్రకారం గురువారం ఇంట్లో బూజు దులపడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి ఈశాన్య కోణం బలహీన పడుతుందని నమ్ముతారు. చెత్తను గురువారం అమ్మడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులపై చెడు ప్రభావం పడుతుంది.
లావాదేవీలు వద్దు
గురువారం మర్చిపోయి కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. గురువారం రోజు జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలహీన పరుస్తాయి. బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
హెయిర్ కట్ వద్దు
గురువారం నాడు గడ్డం, మీసం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పనులు చేస్తే ఆరోగ్యం, పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది.
గురు గ్రహాన్ని బలపరిచే పరిహారాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం ద్వారా జాతకంలో బృహస్పతి స్థానం మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి గురువు బలపడాలంటే గురువారం విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి.
ఆర్థిక పరిస్థితిని మార్చుకునేందుకు ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించాలి. గురువు స్థానం బలంగా ఉండేందుకు పసుపు వస్తువులు దానం చేయాలి.
బృహస్పతి చెడు ప్రభావాన్ని నివారించేందుకు, వివాహానికి అడ్డంకులు తొలగించేందుకు గురువారం అరటి చెట్టును పూజించాలి. అలాగే చెట్టు ముందు ఐదు దీపాలు వెలిగించాలి. శనగలు బెల్లం ప్రసాదంగా స్వీకరించాలి. లక్ష్మీదేవిని పూజించాలి.
జాతకంలో గురు లోపం ఉంటే దానివల్ల ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే గురువారం స్నానం చేసే నీటిలో ఒకటి లేదా రెండు చిటికెల పసుపును వేసుకొని చేయాలి.
గురువారం దక్షిణ దిశలో ప్రయాణించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ రోజున ఆ దిశలో ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే జీవితంలో సంపద, సౌభాగ్యం కలుగుతాయి. అందుకే గురువారం ఈ చర్యలు పాటించడం వల్ల ఇంట్లో పెద్దరికంతోపాటు అనేక సమస్యలు తొలగిపోతాయి.
గురువారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శనగలు, బెల్లం ఉంచాలి. అలాగే ఇంట్లోనే పూజ మందిరానికి పసుపు రంగు పూల దండ వేలాడదీయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి వాతావరణం ఏర్పడుతుంది. గురుగ్రహం బలపడుతుంది.
తులసి పూజ
గురువారం తులసి మొక్కని పూజించిన నీటిని సమర్పించడం చాలా మంచిదిగా భావిస్తారు. అలాగే తులసికి కుంకుమ, పసుపు రంగు పూలు సమర్పించాలి. తులసి మాలతో మంత్రాలు పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.