తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lunar Eclipse 2024: చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారిని అదృష్టం వరించనుంది

Lunar eclipse 2024: చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారిని అదృష్టం వరించనుంది

Gunti Soundarya HT Telugu

05 January 2024, 14:00 IST

google News
    • Lunar eclipse 2024: ఈ ఏడాదిలో వచ్చే తొలి చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి శుభం చేకూర్చనుంది. మరికొన్ని రాశుల వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 
చంద్రగ్రహణం తర్వాత మెరిసే రాశులు ఇవే
చంద్రగ్రహణం తర్వాత మెరిసే రాశులు ఇవే (pixabay)

చంద్రగ్రహణం తర్వాత మెరిసే రాశులు ఇవే

Lunar eclipse 2024: 2024లో తొలి చంద్ర గ్రహం మార్చి 25 న ఏర్పడబోతుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారత్ లో కనిపించదు. సుతక్ కాలం పాటించాల్సిన అవసరం లేదు. అయితే చంద్రగ్రహణం అన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావాలు చూపుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

కొన్ని రాశుల వారికి చంద్ర గ్రహణం తర్వాత నుంచి అదృష్టం పట్టబోతుంది. వారి సంపద పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొన్ని రాశుల వారు సంవత్సరం చివరి వరకు చాలా ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరిని ధనవంతులుగా మారుస్తుంది, ఎవరికి అశుభ ఫలితాలు ఎదురు కాబోతున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

వృత్తిపరమైన కార్యకలాపాలు మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి. రిస్క్ తీసుకుని మరీ కెరీర్ కి సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ప్రశంసలు దక్కుతాయి. మనసు కొద్దిగా ఆందోళన చెందుతుంది. సహోద్యోగులతో మాట్లాడే ముందు మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది.

వృషభం

ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయి అదనపు డబ్బు సంపాదించే మార్గాల కోసం ప్రయత్నించండి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు మంచి సమయం.

మిథునం

మీ లక్ష్యాలని సాధించుకోవడం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. మీరు కోరుకున్న ఫలితం సాధించాలంటే మీరు మీ వృత్తిపరమైన కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ది ఆశించనంతగా లేక మిమ్మల్ని నిరాశ పరుస్తుంది.

కర్కాటకం

మీ వృత్తిపరమైన వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు వస్తాయి. గత సంబంధాలు వదిలేయడంతో కొత్త వ్యక్తులు మీకు తారసపడతారు. దీని ఫలితంగా సహోద్యోగులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహ రాశి

సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వృత్తి జీవితం సమతుల్యంగా ఉంటుంది. పని బాధ్యతలు పేరుగతాయి. కెరీర్ లో ముందుకు సాగడానికి సరైన వ్యక్తుల్ని కలుసుకుని వారితో ప్రయాణించడం మంచిది.

కన్య రాశి

చంద్ర గ్రహణం తర్వాత కన్య రాశి వాళ్ళు ఉద్యోగ సంబంధాలు, ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పనిలో కొత్త బాధ్యతలు మీమీద పడతాయి. వాటిని నెరవేర్చేందుకు దృష్టి పెట్టండి.

తుల రాశి

ఉద్యోగంలో మీరు సాధించే విజయాలు చూసి సహోద్యోగులు మీ మీద పగ పెంచుకునే అవకాశం ఉంది పోటీతత్వం ఏర్పడుతుంది. విజయాలని చూసుకుని గర్వానికి పోతే విమర్శల పాలవుతారు.

వృశ్చికం

మీరు చేపట్టే ఏ పనిలోనైన పురోగతి సాధించేందుకు ప్రయత్నించండి. తలపెట్టిన పనుల్లో ఒడిదుడుకులు, ఆటంకాలు ఏర్పడతాయి. ధృడ సంకల్పంతో వాటిని అధిగమించేందుకు ప్రయత్నించండి. తీవ్రమైన ఒత్తిడిలో కూడా బాగా పని చేయగలుగుతారు.

ధనుస్సు

పని చేసే చోట మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తారు. వాటిని చాల తెలివిగా చాకచక్యంగా అధిగమించగలుగుతారు.

మకరం

మీ బాధ్యతలు, లక్ష్యాలపై ఏకాగ్రత పెట్టాలి. చేజారింది అనుకున్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం చేసే చోట మీకు ప్రాధన్యత పెరుగుతుంది.

కుంభం

ఆఫీసులో మిమ్మల్ని చెడు చేసే వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీ లక్ష్యాలు సాధించుకునేందుకు అనువైన సమయం. ఈ టైమ్ ని మీరు సద్వినియోగం చేసుకోండి. కొన్ని విషయాల్లో ఆనందంగా ఉంటారు.

తదుపరి వ్యాసం