Holika dahan ash benefits: హోలికా దహనం బూడిదతో ఇలా చేశారంటే మీ ఆర్థిక కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి
23 March 2024, 14:07 IST
- Holika dahan ash benefits: హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. బూడిదను ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవని చెబుతున్నారు.
హోలికా దహనం బూడిదతో పరిహారాలు
Holika dahan ash benefits: హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకత ఈ వేడుక జరుపుకుంటారు. భద్ర నీడలేని సమయంలో హోలికా దహన్ నిర్వహిస్తారు. అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కష్టాలు తొలగిపోవాలని వేడుకుంటారు. హోలికా దహనం అగ్నిలో ఆవు పేడతో చేసిన పిడకలు, విరిగిపోయిన వస్తువులు, ఎండిన కొమ్మలు వంటివి వేసి అగ్నిని వెలిగిస్తారు. దీని నుంచి వచ్చే బూడిదకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ బూడిదను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు.
హోలికా దహనానికి సంబంధించి అనేక ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో చెకుముకిరాయి సహాయంతో మంటలను వెలిగించే ఆచారాలు ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతుంది. అలాగే హోలికా దహనం నిర్వహించిన తర్వాత ఆ వేడి బొగ్గుల మీద కొంతమంది నడుస్తారు. తమ జీవితంలో నెలకొన్న భయాలు, కష్టాలు, దుఃఖాలు తొలగిపోవాలని కోరుకుంటూ అగ్నిగుండం తొక్కుతారు. ఈ బూడిదకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీన్ని గ్రామీణ ప్రాంత వాసులు చాలా భద్రంగా చూసుకుంటారు.
తమ జీవితంలో నెలకొన్న దురదృష్టాన్ని పారద్రోలమని కోరుకుంటూ హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదతో కొన్ని పరిహారాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలోనే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
హోలికా దహనం బూడిదతో కొంతమంది స్నానం చేస్తారు. మరి కొందరు ఇంట్లో చల్లుకుంటారు. ఇంకొందరు దాన్ని భద్రపరుచుకుంటారు. ఇవన్నీ చేయడం వెనుక కొన్ని అర్థాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో చల్లడం వల్ల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా నశించిపోతాయని చెబుతారు.
దోషాలు తొలగిపోవడానికి..
ఈ భస్మాన్ని శివలింగానికి అభిషేకం చేయడం వల్ల జాతకంలో రాహు, కేతు ప్రభావాలు తగ్గించుకోవచ్చని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు
ఈ బూడిదలో శక్తివంతమైన వైద్య గుణాలు ఉన్నాయని నమ్ముతారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక నెలపాటు ఈ బూడిదను తిలకంగా పెట్టుకుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు.
సంప్రదాయం ప్రకారం హోలికా దహనం తర్వాత మిగిలిన బూడిదను సేకరించి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి దాంతోపాటు ఒక నాణెం అందులో పెట్టి మూట కట్టాలి. ఈ మూటని ఇంట్లో డబ్బులు ఉంచుకునే సేఫ్ లాకర్లో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులకు తలుపులు తెరుచుకుంటాయని విశ్వసిస్తారు.
ఆర్థిక స్థిరత్వం కోసం
ఈ భస్మాన్ని ఇంటి మూలలో చెల్లితే వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఘర్షణ వాతావరణం, గొడవలతో నిమగ్నమైన కుటుంబాలలో ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యాన్ని వ్యాప్తి చేయగలరని నమ్ముతారు.
నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఈ బూడిదను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. ఈ బూడిదను ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా కూడా సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోనే అన్ని మూలల దీన్ని చల్లడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.
టాపిక్