Lunar eclipse: చంద్రగ్రహణం నీడ ఏ రాశి వారి మీద ఎలా ఉంటుంది? ఈ పరిహారాలు పాటిస్తే మంచిది
Lunar eclipse: మార్చి 25 హోలీ పండుగ రోజు చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతుంది. దీని ప్రభావం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉంటుంది. అయితే దాని నుంచి బయట పడేందుకు ఈ పరిహారాలు పాటించడం మంచిది.
Lunar eclipse: మార్చి 24న హోలికా దహన్ నిర్వహిస్తే, మార్చి25న రంగుల పండుగ హోలీ జరుపుకుంటారు. హోలీ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. సుమారు వంద సంవత్సరాల తర్వాత హోలీ చంద్రగ్రహణం కలిసి వచ్చాయి. గ్రహం ప్రభావం జాతకం మీద ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ గ్రహణం భారత దేశంలో కనిపించింది. కానీ దాని ప్రభావం మాత్రం మొత్తం 12 రాశుల మీద ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చంద్రగ్రహణం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. భారత్ లో గ్రహణం కనిపించకపోవడం వల్ల సూతక్ కాలాన్ని పరిగణలోకి తీసుకోరు. అయితే చంద్రగ్రహణం ప్రభావం ఏ రాశి వారి మీద ఎలా ఉంటుంది? దాని నుంచి తప్పించుకునేందుకు ఎటువంటి పరిహారాలు పాటించాలో చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి చంద్రగ్రహణం అశుభ ప్రభావాలను ఇస్తుంది. పని ప్రాంతంలో సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి.
మిథునం
మిథున రాశి వారికి ఈ గ్రహణం శుభప్రదంగా ఉంటుంది. ధనాన్ని పొందగలుగుతారు. ఆవులకు పచ్చి గడ్డి తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
చంద్రగ్రహణం ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడికి సంబంధించిన శ్లోకాన్ని జపించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి చంద్రగ్రహణం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సూర్య బీజ మంత్రాన్ని జపించండి.
కన్యా రాశి
కన్యా రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆవుకు సేవ చేయడం పచ్చి గడ్డి తినిపించడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి చంద్రగ్రహణం సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. పేదలకు అన్నదానం చేయాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం మేలు చేస్తుంది. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించాలి.
ధనుస్సు రాశి
చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి మంచిది కాదు. ఈ సమయంలో సూర్యుడు బృహస్పతికి చెందిన మీనరాశిలో ఉంటాడు. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. గోమాతకు ఆహారం పెట్టడం మంచిది. బృహస్పతి మంత్రాన్ని పఠించాలి.
మకర రాశి
చంద్రగ్రహణం వల్ల మకర రాశి జాతకులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శుభ ఫలితాల కోసం ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, చంద్రుడి శ్లోకం పఠించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి కూడా ఈ గ్రహణం మంచిది కాదు. స్నేహితుల బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బూట్లు లేదా చెప్పులు పేదలకు దానం చేయండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. గోమాతకు ఆహారం పెట్టండి. బృహస్పతి బీజ మంతాన్ని జపించాలి.