ఎరుపు రంగు అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ధర కూడా తక్కువ. ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే ఎర్రటి అరటిపండు తినండి.

Unsplash

By Anand Sai
Nov 17, 2023

Hindustan Times
Telugu

ఎర్రటి అరటిపండును నిరంతరం 21 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Unsplash

ఈ రెడ్ కలర్ అరటిపండ్లు తినడం వల్ల చర్మం ఎర్రబడటం, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయవచ్చు.

Unsplash

కంటి ఆరోగ్యం దృష్ట్యా ఎర్ర అరటిపండు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. శుక్లాల సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

Unsplash

చాలా మంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఈ అరటిపండును నిత్యం తింటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి సంతానోత్పత్తి పెరుగుతుంది.

Unsplash

ఎర్రటి అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధితో బాధపడేవారు రోజూ అరటిపండు తింటే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.

Unsplash

ఎర్ర అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.

Unsplash

ఇలా రోజు ఎర్రటి అరటి పండ్లు తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆలస్యం చేయకుండా తినడం మెుదలుపెట్టండి. కానీ అతిగా తినొద్దు.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels