Chaitra Amavasya: చైత్ర అమావాస్య రోజు ఇలా చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఏలినాటి శని నుంచి విముక్తి
07 May 2024, 14:21 IST
- Chaitra Amavasya: చైత్ర అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని నుంచి విముక్తి కలుగుతుంది.
వైశాఖ అమావాస్య పరిహారాలు
Chaitra amavasya: మే 8వ తేదీ చైత్ర అమావాస్య వచ్చింది. ఈరోజుతో చైత్ర మాసం ముగుస్తుంది. మే 9వ తేదీ నుంచి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో చైత్ర అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంది.
చైత్ర అమావాస్య రోజు కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కూడా పేదరికంతో బాధపడుతున్నట్లయితే చైత్ర అమావాస్యనాడు ఈ పరిహారాలు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.
చైత్ర అమావాస్య పరిహారాలు
చైత్ర అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఉదయాన్నే రావి చెట్టుకు నీరు సమర్పించండి. సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి పరిక్రమం చేయాలి.
అమావాస్య రోజు నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మీ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసుకునేందుకు ఈరోజు తులసిమాలతో గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
మీ ఇంట్లోని ప్రతికూలతను తరిమికొట్టేందుకు ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో ఉప్పు వేసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
అమావాస్య రోజు ఆవులను సేవించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈరోజు మర్చిపోయి కూడా జంతువులను హింసించడం, వాటికి ఆహారం పెట్టకుండా ఉండటం వంటివి చేయకూడదు.
పితృ దోషాలు తొలగించుకునేందుకు
పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృ దోషం నుంచి పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందేందుకు అమావాస్య రోజు చాలామంచిదిగా భావిస్తారు. అందువల్ల ఈరోజు దానధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయడం ద్వారా పూర్వీకుల సంతోషిస్తారు. పేదవారికి బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయాలి. అదే సమయంలో సూర్యాస్తమయం తర్వాత ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశలో దీపం వెలిగించాలి. పితృ స్తోత్రం, పితృకవచం పఠించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.
శని ప్రభావం తగ్గించుకునేందుకు
చైత్ర అమావాస్య రోజు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాలు కూడా తొలగించుకోవచ్చు. ఈ ఏడాది కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారిపై శని సతీ, దయ్యా చెడు ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వాటి నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్యనాడు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. శని దేవుని అనంత అనుగ్రహం పొందేందుకు అమావాస్య రోజు శని చాలీసా పఠించాలి.
శివారాధన
చైత్ర అమావాస్య రోజు పరమశివుడిని పూజించడం వల్ల శని దేవుడి చెడు ప్రభావాలు తగ్గుతాయి. శివుడిని ఆరాధించడం, పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. అదే సమయంలో శని సడే సతీ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు, పితృ దోషం, సర్పదోషం నుంచి విముక్తి పొందేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలం, పచ్చిపాలు సమర్పించాలి. శివ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఏర్పడుతుంది.