Gaja kesari yogam: 100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం-after hundred years gaja kesari yogam in akshaya tritiya these zodiac signs get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gaja Kesari Yogam: 100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం

Gaja kesari yogam: 100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం

Gunti Soundarya HT Telugu
May 03, 2024 03:22 PM IST

Gaja kesari yogam: సుమారు 100 సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఐదు రాశుల వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం లభించబోతుంది.

100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం
100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం

Gaja kesari yogam: దాదాపు వంద సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున చంద్రుడు, బృహస్పతి కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది.

వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం ముఖ్యమైన, పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. దేవ గురువు బృహస్పతి, చంద్రుడు మంచి స్నేహితులుగా చెప్తారు. ఈ రెండు గృహాల కలయిక వల్ల పవిత్రమైన ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది ఎంతో పవిత్రమైన యోగం. అక్షయ తృతీయ నాడు ఏర్పడబోతున్న ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించడం ఖాయం. లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందబోతున్నారు.

అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగంతో పాటు శశ రాజ యోగం, మాలవ్య ,యోగం ధన యోగం, రవి యోగం అనే ఐదు మహా శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ యోగంలో చేసే ఆరాధన, దానం, ఉపవాసం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. అన్ని శుభకార్యాలు సజావుగా సాగేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు అక్షయ తృతీయ రోజున ఉన్నత స్థితిలో ఉంటాయి. అందుకే ఈ రోజున ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. అటువంటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులు ఏవో చూద్దాం.

మిథున రాశి

మీ జీవితంలోకి కొత్తగా స్నేహితులు రావచ్చు. మేధోపరమైన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. పనిలో ఉత్సాహంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. తల్లి వైపు నుంచి ధనం పొందే అవకాశం ఉంది.

సింహ రాశి

అక్షయ తృతీయ నుంచే సింహ రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగం మారడంతో వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారంలో లాభావకాశాలు ఉంటాయి. వాహన సుఖం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు నెరవేరుతాయి. సోదరుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దుస్తులను బహుమతులుగా అందుకుంటారు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి మద్దతు లభిస్తుంది. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు అండగా నిలుస్తారు. కుటుంబంలో సౌకర్యాలు విస్తరించుకుంటారు. పని ప్రాంతంలో మార్పు వస్తుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

తులా రాశి

ఉద్యోగం నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. చదువుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనుస్సు రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది.

 

 

WhatsApp channel