Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది-buy these things on the auspicious day of akshaya tritiya you will get goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది

Gunti Soundarya HT Telugu
Apr 23, 2024 07:04 PM IST

Akshaya tritiya 2024: సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కానీ బంగారం మాత్రమే కాదు ఇవి కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

అక్షయ తృతీయ రోజు ఇవి కొన్నారంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది
అక్షయ తృతీయ రోజు ఇవి కొన్నారంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది

Akshaya tritiya 2024: హిందూమతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని, తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు.

ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీ వచ్చింది. ధన్ తేరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు, అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి.

అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీరు సంపన్నులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు.

అక్షయ తృతీయ రోజు ఇవి కొనండి

అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు. శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఆరోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖసంతోషాలు, సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు.

అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు.

బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. పూజ మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి.

అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం. ధన ధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

అక్షయ తృతీయ అంటే అనంతమైనది, తరగనిది, చెక్కుచెదరనిది ఫలప్రదమైనదిగా చెప్తారు. ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు. ఈరోజునే విష్ణువులోని భాగమైన వేద వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెప్తారు. అలాగే అక్షయ తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది. విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈ రోజే ఎత్తాడని నమ్ముతారు. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.

అక్షయ తృతీయ నాడు చేసే పూజలు, జపం, దానం మొదలైనవి చేస్తే ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

శ్రీ సూక్తాన్ని 11 సార్లు పఠించాలి.

ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 5 నుండి 11 సార్లు జపించాలి.

అలాగే 108 మఖానాతో మాల తయారుచేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది.

WhatsApp channel