ఫ్రిజ్ కన్నా మట్టి కుండలోని నీళ్లు తాగడమే ఆరోగ్యం

pixabay

By Haritha Chappa
Apr 17, 2024

Hindustan Times
Telugu

వేసవిలో కచ్చితంగా చల్లని నీళ్లు తాగాలనిపిస్తుంది. చల్లని నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది.

pixabay

 వేసవి నెలల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు చల్లటి నీటి కోసం ఫ్రిజ్ మీద ఆధారపడతారు. కానీ మట్టి కుండలోని నీళ్లు తాగడమే మంచిది.

pixabay

మట్టి కుండలో సాధారణంగానే శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి కుండలోని నీళ్లను తాగితే దాహం తీరుతుంది. 

pixabay

మట్టి కుండల్లోని నీళ్లలో మట్టిలో ఉన్న ఖనిజాలు కూడా కలుస్తాయి. కాబట్టి అవి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి.

pixabay

మట్టి కుండలోని నీళ్లు ఎప్పుడు తాగిన తాజాగా ఉంటాయి. ఆ నీళ్లు తాగితే శరీరం చల్లబడుతుంది. 

pixabay

మట్టి కుండలోని నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. 

pixabay

మట్టి కుండలో నీరు ఆరోగ్యకరమైన PH సమతుల్యతను కలిగి ఉంటాయి.

pixabay

ప్లాస్టిక్ లేదా ఇతర లోహపు పాత్రల్లాగా మట్టి కుండలు హానికరమైన రసాయనాలను లేదా కలుషితాలను నీటిలోకి విడుదల చేయవు.

pixabay

రాత్రివేళ ఈ ఆహారాలు తింటే ఊబకాయం పెరిగే రిస్క్

Photo: Pexels