Phool makhana dosa: ఫూల్ మఖానాతో.. తక్కువ కేలరీల దోశ-try this best oil less phool makhana dosa recipe for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Phool Makhana Dosa: ఫూల్ మఖానాతో.. తక్కువ కేలరీల దోశ

Phool makhana dosa: ఫూల్ మఖానాతో.. తక్కువ కేలరీల దోశ

Koutik Pranaya Sree HT Telugu
Oct 31, 2023 07:07 PM IST

Phool makhana dosa: ఫూల్ మఖానాతో ఎప్పుడైనా దోశలు చేసుకుని చూశారా? చాలా సింపుల్ గా అయిపోతాయి. వాటి తయారీ ఎలాగో తెలుసుకోండి.

ఫూల్ మఖానా దోశ
ఫూల్ మఖానా దోశ

ఫూల్ మఖానాలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కాదు. అయితే దానితో చేసే వంటకాలు మన దగ్గర పెద్దగా ప్రాచుర్యంలో ఉండవు. ఉత్తర భారత దేశంలో దానితో కూరలు, స్నాక్స్ కాస్త ఎక్కువగానే చేస్తుంటారు. అల్పాహారంలోకి మఖానా చేర్చుకోవడానికి ఉత్తమ మార్గం మాత్రం వాటితో దోశలు చేసుకోవడమే. పది నిమిషాల్లో ఫూల్ మఖానాలతో దోశపిండి సిద్ధం అయిపోతుంది. పొట్ట కూడా లైట్ గా అనిపిస్తుంది. దాని తయారీ ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఫూల్ మఖానా

సగం కప్పు సన్నం రవ్వ

సగం కప్పు అటుకులు

సగం కప్పు పెరుగు

1 నీళ్లు

తగినంత ఉప్పు

కొద్దిగా వంటసోడా

తయారీ విధానం:

  1. ముందుగా మఖానాను నూనె లేకుండా ఒక రెండు నిమిషాల పాటూ బాగా వేయించుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో మఖానా, పెరుగు, రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అవసరమైతే కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి.
  3. ఈ మిశ్రమాన్ని పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా పట్టుకోవాలి.
  4. అవసరమైతే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పిండి గిన్నెలోకి తీసుకుని కాస్త ఉప్పు, వంటసోడా వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటూ బాగా గిలకొట్టినట్టు చేయాలి.
  5. ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త మందంగా దోశలు వేసుకోవాలి. ఒక పక్క కాల్చుకుంటే సరిపోతుంది. అవసరమైతేనే అంచుల వెంబడి నూనె పోసుకోండి. ఈ దోశల్ని ఏదైనా మీకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి.

Whats_app_banner