Mercury transit: బుధుడి సంచారం.. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం పెరుగుతుంది, పొదుపు చేస్తారు-mercury direct transit in pisces these zodiac signs get goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: బుధుడి సంచారం.. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం పెరుగుతుంది, పొదుపు చేస్తారు

Mercury transit: బుధుడి సంచారం.. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం పెరుగుతుంది, పొదుపు చేస్తారు

Gunti Soundarya HT Telugu
Apr 20, 2024 05:29 PM IST

Mercury transit: ప్రస్తుతం తిరోగమన దశలో సంచరిస్తున్న బుధుడు త్వరలో ప్రత్యక్ష మార్గంలో సంచరించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు దక్కబోతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు ఆదా చేసుకుంటారు.

ప్రత్యక్ష మార్గంలోకి బుధుడు
ప్రత్యక్ష మార్గంలోకి బుధుడు

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. త్వరలో బుధుడు ప్రత్యక్ష మార్గంలో ప్రయాణించనున్నాడు. నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఏప్రిల్ 25వ తేదీ బుధుడు మీన రాశిలో ప్రత్యక్ష సంచారం చేయనున్నాడు.మీన రాశి బుధుడికి బలహీనమైన రాశిగా పరిగణిస్తారు. ఫలితంగా కొన్ని కీలక విషయాల్లో నిర్ణయాత్మక సామర్థ్యాలు క్షీణిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. మేధస్సు, శక్తి, సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది. పనిలో సానుకూల విజయాలు లభించకపోవచ్చు.

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, జ్ఞానం వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు. కన్యా రాశి, మిథున రాశిలో బుధుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. ఈ రెండు రాశులకు అధిపతి బుధుడు. మీన రాశిలో బుధుడు ప్రత్యక్షంగా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. బుధుడి కదలిక వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ కాలంలో ఎంతో ప్రయోజనం పొందుతారు. నగదు అవకాశాలు ఉన్నాయి. డబ్బును కూడా ఆదా చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి డబ్బు అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. 

మిథున రాశి

బుధుడు ప్రత్యక్ష మార్గంలో సంచరించడం మిథున రాశి వారికి ప్రయోజనాలను ఇవ్వబోతుంది. డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు తారసపడతాయి. విదేశాలలో కూడా పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా పెట్టుబడులు పెట్టే అవకాశం కలుగుతుంది. విజయవంతంగా డబ్బులు ఖర్చు చేస్తూనే ఆదా కూడా చేయగలుగుతారు. ఆస్తి సంపాదించగలుగుతారు. పెట్టుబడులపై మంచి రాబడి పొందే అవకాశం ఉంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఆర్థికంగా మెరుగుపడేందుకు ఇది మంచి సమయం. బాగా డబ్బు సంపాదించగలుగుతారు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో డబ్బు సంపాదించేందుకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులను అధిగమించి నాయకుడిగా మారతారు. ఉద్యోగస్తులకు ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో మరిన్ని అవకాశాలు ఉంటాయి.

మకర రాశి

బుధుడి ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి మేలు చేస్తుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మీ అవసరాలను తీర్చుకుంటేనే డబ్బు ఆదా చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదించేందుకు మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల కోరికలు తీర్చగలుగుతారు. ఫలితంగా సంతోషకరమైన ప్రశాంతమైన కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది.

మీన రాశి

మీన రాశిలోనే బుధుడు ప్రత్యక్ష మార్గంలో సంచరించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ నుండి లాభాలు కలుగుతాయి. వ్యాపార ఒప్పందాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. డబ్బు సంపాదించేందుకు, ఆదా చేసేందుకు వివిధ ఎంపికలు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మంచి జీవితాన్ని పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంతృప్తిని ఇస్తుంది. 

 

Whats_app_banner