తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Devi Navaratrulu 2024: విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ప్రవచన కర్త చాగంటి మాటల్లో

Devi navaratrulu 2024: విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ప్రవచన కర్త చాగంటి మాటల్లో

Gunti Soundarya HT Telugu

01 October 2024, 14:11 IST

google News
    • Devi navaratrulu 2024: దేవి నవరాత్రులు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గ ఆలయం. అసలు ఇక్కడ ఇంతటి విశిష్టత ఏర్పడటానికి కారణం ఏంటి? కనకదుర్గ అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు చక్కగా వివరించారు. 
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

Devi navaratrulu 2024: అక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఆదిపరాశక్తి అమ్మవారిగా పూజలు అందుకుంటోన్న దుర్గాదేవి శరన్నవరాత్రులు అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అక్టోబర్ 12న చెడుపై మంచికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారు.

లేటెస్ట్ ఫోటోలు

Pregnancy Diet: ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాారా..? అయితే మీ డైట్‌లో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి

Dec 22, 2024, 11:29 AM

ఇప్పుడు స్మార్ట్​ఫోన్స్​కి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు- రూ. 15వేల బడ్జెట్​లో ఇవి ది బెస్ట్​!

Dec 22, 2024, 09:00 AM

TG Indiramma Housing Scheme Updates : ప్రతి మండలంలో 'ఇందిరమ్మ మోడల్ హౌజ్' నిర్మాణం..! అర్హుల జాబితా ఎప్పుడంటే..?

Dec 22, 2024, 08:27 AM

CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి

Dec 21, 2024, 11:48 PM

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

రాక్షస సంహారం చేసిన దుర్గాదేవి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు. ఇంద్రకీలాద్రి విశిష్టత ఏంటి అనే దాని గురింకీ ప్రవచన రత్నాకర్ వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు చక్కగా వివరించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి విశిష్టత గురించి ఆయన మాటల్లో తెలుసుకుందానం.

పూర్వం రాక్షసులకు ఆడవారి పట్ల చులకన భావన ఉండేది. పంచభూతాల్లో వచ్చే శరీరం మళ్ళీ పంచ భూతాల్లో కలిసిపోవాల్సిందే. మేం దేవతలను జయించాలి, ఈ చరాచర ప్రపంచంలో ఉండే ఏ జాతి వల్ల ముఖ్యంగా పురుష జాతి వల్ల మాకు ఎలాంటి హాని జరగకూడదు. మా ప్రాణాలు తీసేందుకు ఏ జాతిలో ఉన్నట్టువంటి పురుషులు సమర్థులు కాకూడదు అని రాక్షసులు బ్రహ్మను అడిగారట. పురుషులు చేయలేని పని ఆడది చేయలేదు కదా అనే చులకన భావన వారిది.

స్త్రీతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే పురుషుల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని వరం అడిగితే అందుకు బ్రహ్మ వరం ఇచ్చారు. దీంతో రాక్షసులు తమకు ఎదురే లేదు అన్నట్టు ప్రవర్తించారు. దేవలోకం మీదకు వెళ్ళి దేవేంద్రుడిని పదవి నుంచి తప్పించి అమరావతిని ఆక్రమించారు. సమస్త భోగాలు అనుభవించారు. తర్వాత రుషుల జోలికి వెళ్లారు. నన్ను నమ్ముకున్న సాధువుల రూపంలో ఉన్న వారి మనసులు కష్టపెడతారో అప్పుడు నేను ఒక రూపం ధరించి సంహరిస్తారని రాక్షసులను అమ్మవారు హెచ్చరించింది. వారిని సంహరించడం కోసం అమ్మవారు తన శరీరం నుంచి రెండు అంశలను ఇచ్చింది.

ఒకటి కౌశికిc అయితే మరొకటి కాళిక దేవి. ఇద్దరూ రాక్షసులను సంహరించేందుకు చెరొక వైపు బయల్దేరారు. కాళికా దేవి ఆకృతి భయంకరంగా ఉంటుంది. కౌశికి దేవి విజయవాటిక ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతమే ఇప్పటి విజయవాడ. శుంభులు శుంభులు అనే రాక్షసులకు చెందిన మంత్రులు అమ్మవారిని చూసి ఇలాంటి మహిళను పెళ్లి చేసుకుంటే రాజుగారికి బాగుంటుందని వెళ్ళి చెప్పారు. దీంతో శుంభుల శుంభులు పెళ్లి చేసుకుంటామని అమ్మవారిని అడిగితే మిమ్మల్ని సంహరించడానికి వచ్చిన అవతారం నేను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటని అన్నారట.

నేను పరమశివుడి భార్యను అని చెప్పి వారితో భీకర యుద్ధం చేస్తుంది. కౌశికి కత్తితో రాక్షసుడిని పొడిచినప్పుడు అతడి నుంచి వచ్చిన రక్తపు బొట్లు నేల మీద పడినప్పుడు వాటి నుంచి మళ్ళీ రాక్షసులు పుట్టుకు వచ్చారు. అప్పుడు కౌశికి కాళికా దేవిని పిలిచింది. ఆమె నాలుక చాపగా దాని మీద ఉండి యుద్ధం చేసింది. పడిన రక్తం మొత్తం కాళీకా దేవి చప్పరించేసింది. ఇలా ఎందుకు అంటే ప్రజలని రక్షించేందుకు చేసింది. అలా చివరికి శుంభులు శుంభులు కౌశికి దేవి చేతిలో సంహారం అయ్యారు. ఆమె దుర్గాదేవి అంశ.

అమ్మవారిని కీర్తిస్తూ అక్కడి వాళ్ళందరూ జయజయ ధ్వానాలు చేశారు. అప్పుడు అమ్మవారి వారి మీద కనకవర్షం కురిపించారు. అలా అమ్మవారి పేరు కనకదుర్గగా మారిందని చాగంటి తెలిపారు. అప్పటి నుంచి విజయవాటిక ఇప్పటి విజయవాడలో కనకదుర్గగా అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటున్నారని ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు తెలియజేశారు.

తదుపరి వ్యాసం