తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horoscope Today: ఈరోజు రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి తిరుగేలేదు!

Horoscope Today: ఈరోజు రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి తిరుగేలేదు!

HT Telugu Desk HT Telugu

26 September 2022, 5:35 IST

google News
    • Horoscope Today: ఈరోజు రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ సెప్టెంబర్ 26, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today
Horoscope Today (Pixabay)

Horoscope Today

Horoscope Today: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము) 26.9.2022

లేటెస్ట్ ఫోటోలు

కేతువు సంచారంతో కొత్త ఏడాదిలో ఈ రాశులవారికి మంచి జరగనుంది.. పని ప్రదేశంలో గుర్తింపు!

Dec 23, 2024, 08:57 PM

Building Permissions : భవన నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఐదంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు

Dec 23, 2024, 06:59 PM

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ

Dec 23, 2024, 05:52 PM

ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారి అదృష్టం మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుదల!

Dec 23, 2024, 05:14 PM

Christmas Party 2024: క్రిస్మస్‌కు ఇంటికి అతిథులను ఆహ్వానిస్తున్నారా..? మెనూలో ఇవి చేర్చారంటే అందరూ మెచ్చుకుంటారు!

Dec 23, 2024, 04:20 PM

Pakistan Cricket: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా..

Dec 23, 2024, 02:29 PM

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వయుజం,

వారం: సోమవారం, తిథి: శు. పాడ్యమి నక్షత్రం: ఉత్తర

మేషరాశి :

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఖర్చు అధికముగా ఉండును. వాక్ స్థానము నందు కుజుని సంచారము, జన్మరాహు ప్రభావముచేత ఒత్తిళ్ళు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. నిర్ణయాలు ఆవేశంతో కాకుండా ప్రశాంతముగా తీసుకొనుట మంచిది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృషభరాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేయడానికి ప్రయత్నించెందరు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశివారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిథునరాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉంది. అష్టమ శని ప్రభావము వలన మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఏర్పడును. కుటుంబమునందు చికాకులు, ఉద్యోగము నందు ఒత్తిళ్ళు కలుగును. మీయొక్క కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందెదరు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిథునరాశి వారు రుద్రాభిషేకము, శివారాధన చేయటం వలన ఈ రోజు మంచిది.

కర్కాటకరాశి :

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండును. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శారీరక సౌఖ్యమును పొందెదరు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితము కలుగును.

సింహరాశి :

ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకు చికాకులు అధికముగా ఉన్నవి. స్త్రీలకు అధిక శ్రమ కలుగును. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్యారాశి :

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. ధనము అధికముగా ఖర్చు చేసెదరు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

తులా రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తము నుండి అనుకూలముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :

ఈ రోజు మీకు అనుకూలఫలితాలు ఉన్నవి. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఉద్యోగములో పని ఒత్తిడి ఉండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము, బిల్వాష్టకము చదువుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

ధనూ రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. మీరు అనుకునే ప్రతీ పని పూర్తి చేసెదరు ఏలినాటి శని ప్రభావం వలన కొంత చికాకులు కలుగును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు శివాలయంలో శివుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శివాష్టకము, లింగాష్టకము పఠించడం వలన ఆరోగ్యస్థితి కలుగును.

కుంభ రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించెందరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు లాభదాయకము. ఈ రోజు శ్రద్ధ పెట్టి చేసిన ప్రతీ పని సఫలం కాగలదు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేసుకోవడం, అలాగే శివాపంచాక్షరీ మంత్రంలో జపం చేయడం వలన వలన శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. నరఘోష శత్రుబాధ పెరుగును. మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

తదుపరి వ్యాసం