తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు..

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు..

04 December 2022, 6:15 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? డిసెంబర్ 4వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (04-12-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Anemia: హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచే ఈ 5 ఆహారాలు తింటే రక్తహీనత సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు

Dec 17, 2024, 10:34 AM

Lord Shiva: శివునికి ఇష్టమైన రాశులు ఇవి, వీరిని శనిదేవుడు తాకలేడు

Dec 17, 2024, 10:30 AM

AP TG Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా జిల్లాలకు మళ్లీ వానలు, రైతులకు హెచ్చరికలు

Dec 17, 2024, 09:55 AM

100 Years of Medak Church : మెదక్ చర్చికి వందేళ్లు.. ఈ చర్చిని బ్రిటిష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా?

Dec 17, 2024, 09:29 AM

Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది

Dec 17, 2024, 07:46 AM

Gold price today : డిసెంబర్​ 17 : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Dec 17, 2024, 05:48 AM

మేషరాశి

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరిస్తే మంచిది. మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే మంచిది.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య విషయాలపట్ల, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. వాదనలు, సమస్యలు నిండి ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిడి కలిగే సూచనలున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించండి.

మిధునరాశి

మిధునరాశివారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబసమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మరిన్ని శుభఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఆదివారం సూర్యాష్టకము పఠిస్తే మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.

తులా రాశి

తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక వేదన, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబమునందు, ఉద్యోగ వ్యాపారమునందు చికాకులు కలుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ, వ్యాపారముల్లో ఓర్పుతో ఆచితూచి వ్యవహరించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చికరాశికి ఈరోజు అంత అనుకూలముగాలేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో వాగ్వివివాదాలు అయ్యే అవకాశముంది. మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉన్నప్పటికి అనుకున్న పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. చేసే ప్రతీ పనికి కొంత అనుకూల ఫలితములు ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదువుకోండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం