తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు అనుకూలంగానే ఉన్నా.. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు అనుకూలంగానే ఉన్నా.. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త

03 December 2022, 5:00 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? డిసెంబర్ 3వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (03-12-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Pragya Jaiswal: ప్ర‌గ్యా జైస్వాల్ డ‌బుల్ ట్రీట్ - పుట్టిన‌రోజు నాడే కొత్త‌ మూవీ రిలీజ్‌!

Dec 17, 2024, 12:29 PM

కొత్త సంవత్సరానికి ముందు ఈ రాశులవారికి అదృష్టం.. అన్నివైపుల నుంచి మంచి!

Dec 17, 2024, 11:31 AM

Anemia: హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచే ఈ 5 ఆహారాలు తింటే రక్తహీనత సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు

Dec 17, 2024, 10:34 AM

Lord Shiva: శివునికి ఇష్టమైన రాశులు ఇవి, వీరిని శనిదేవుడు తాకలేడు

Dec 17, 2024, 10:30 AM

AP TG Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా జిల్లాలకు మళ్లీ వానలు, రైతులకు హెచ్చరికలు

Dec 17, 2024, 09:55 AM

100 Years of Medak Church : మెదక్ చర్చికి వందేళ్లు.. ఈ చర్చిని బ్రిటిష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా?

Dec 17, 2024, 09:29 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఘర్షణలు, మానసిక వేదన ఇబ్బంది పెడతాయి. ఖర్చులు తగ్గించుకోండి. పనుల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొంత అధికమగుతాయి. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. ఆరోగ్య, కుటుంబ విషయాలపట్ల జాగ్రత్త వహించండి. మనస్తాపము, అనారోగ్యం కలుగే సూచనలున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ.. మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్త. కొన్ని సమస్యలు బాధిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయం పక్కన పెడితే ఈ రోజు అనుకూలమైన ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని.. అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. చేసే ప్రతీ పనిలో విజయం పొందుతారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్త ఫలితాలున్నాయి. ఒత్తిడి తగ్గించుకుంటే మంచిది. స్త్రీ సౌఖ్యము కలుగుతుంది. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో, ఉద్యోగ, వ్యాపారంలో చికాకులు ఉంటాయి. విరోధులతో జాగ్రత్తగా ఉండండి. ఓర్పుతో ఆచితూచి వ్యవహరించండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబములో వాగ్వివివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయినా సరే మీరు మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉన్నప్పటికి.. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. ధనలాభము కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం.. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు వెళ్తే మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్తంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ.. ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. చేసే ప్రతీ పని కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమగుతాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగుతాయి. స్త్రీలకు ఈరోజు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కలసి వస్తుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. కుటుంబములోని సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం