తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi 2024: కొత్తగా పెళ్లైన జంట హోలీ రోజు ఇలా చేశారంటే వారి దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది

Holi 2024: కొత్తగా పెళ్లైన జంట హోలీ రోజు ఇలా చేశారంటే వారి దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది

Gunti Soundarya HT Telugu

25 March 2024, 10:37 IST

    • Holi 2024: మార్చి 25 హోలీ పండుగ జరుపుకుంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు హోలీ రోజు ఈ పరిహారాలు పాటించారంటే కలహాలు లేని కాపురంగా సాగిపోతుంది. జీవితాంతం సంతోషంగా గడుపుతారు. 
కొత్తగా పెళ్ళైన జంట హోలీ రోజు ఇలా చేయండి
కొత్తగా పెళ్ళైన జంట హోలీ రోజు ఇలా చేయండి (pexels)

కొత్తగా పెళ్ళైన జంట హోలీ రోజు ఇలా చేయండి

Holi 2024: హిందూ మతంలో హోలీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. భారత్ లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మార్చి 25 హోలీ పండుగ వచ్చింది. హోలీ రోజున ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధాలు ధృడంగా ఉంటాయి.

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

హోలీ రోజున పూజ చేసిన తర్వాత తమ ఇష్ట దైవానికి గులాల్ సమర్పించాలి. ఆ తర్వాత మాత్రమే ఇతర వ్యక్తులతో హోలీ ఆడాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఇష్టదైవం ఆశీస్సులు పొందుతారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.

బంధాలు బలపడేందుకు

హోలీ రోజున భార్యాభర్తలు ఆవు కాళ్లపై రంగులు చల్లి బెల్లం, రోటీ తినిపించాలి. ఇలా చేయడం వల్ల గోమాత అనుగ్రహాన్ని పొందుతారు. భార్యాభర్తల బంధం దృఢంగా ఉంటుంది. అపార్ధాలు తొలగిపోతాయి.

ఆర్థిక ప్రయోజనాల కోసం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజు ఇంటి ప్రధాన ద్వారం మీద కొద్దిగా గులాల్ రాయాలి. అలాగే ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ఎప్పుడు డబ్బులకు కొరత ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంటి మీద పుష్కలంగా ఉంటాయి.

కొత్తగా పెళ్ళైన జంటలు ఇలా చేయండి

కొత్తగా పెళ్లయిన జంటలు హోలీ రోజున శివపార్వతులను పూజించాలి. పూజ తర్వాత వారి పాదాల వద్ద గులాబీ సమర్పించాలి. తర్వాత దంపతులు ఒకరికొకరు రంగులు పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి జీవితాల్లో ఆనందం నిండిపోతుంది. అలాగే కొత్తగా పెళ్ళైన జంటలు రెండు అశోక చెట్టు ఆకులను తీసుకొని దానిపై పింక్ కలర్ తో స్వస్తిక్ గుర్తు వేసి ఒకరి పేరు మరొకరు రాసి తమ ఇష్ట దైవం పాదాల వద్ద సమర్పించాలి. ఈ పరిహారం పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య మాధుర్యం పెరుగుతుంది. సంబంధం బలంగా ఉంటుంది.

మానసిక ప్రశాంతత కోసం

నిత్యం చికాకులు, ఆందోళనలతో విసిగిపోయారా? అయితే హోలీ రోజు సాయంత్రం ఇలా చేయండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మనసు తేలిక పడుతుంది. ఆవు పాలలో నీటిని కలిపి అందులో తెలుపు రంగు పువ్వులు వేసి సాయంత్రం పూట చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

వ్యాపారంలో నష్టాలా?

వ్యాపారంలో నష్టాలతో ఇబ్బందులు పడుతున్నట్టేయితే మీరు ఈరోజు ఈ పరిహారం పాటించి చూడండి. పేదలకు, వృద్ధులకు తెలుపు రంగు వస్తువులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఎదుర్కొంటున్న నష్టాల నుంచి బయట పడతారు.

దానాలు ముఖ్యం

హోలీ రోజు మీరు చేసే దానాలు మీకు మరింత పుణ్యాన్ని తెచ్చి పెడతాయి. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. నిస్వార్థంగా మీరు చేసే సేవ మీకు మేలు చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం