Annapoorna Jayanthi: అన్నపూర్ణ జయంతి రోజున ఈ పరిహరాలు పాటిస్తే మీ ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్లే
03 December 2024, 18:00 IST
- Annapoorna Jayanthi: మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే పండుగ అన్నపూర్ణ జయంతి. 2024వ సంవత్సరం డిసెంబరు 15న అమ్మవారి రూపాలలో ఒకటైన అన్నపూర్ణా దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.
అక్టోబర్ 3న అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ గా దర్శనమిస్తారని అధికారులు వివరించారు.
అన్నపూర్ణ జయంతి సందర్భంగా అన్నపూర్ణ దేవీ వ్రతం ఆచరించడంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖాలు, సమృద్ధి, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుంది. మార్గశిర మాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగను ఈ ఏడాది అంటే 2024వ సంవత్సరంలో డిసెంబరు 15న జరుపుకుంటున్నారు. మీ ఇంట శుభాలు కురిపించే అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందేందుకు ఈ నియమాలు పాటించి పూజలు చేయండి.
లేటెస్ట్ ఫోటోలు
అన్నపూర్ణ జయంతి ఎప్పుడు?
మార్గశిర మాసం పౌర్ణమి రోజు అంటే 14 డిసెంబరు సాయంత్రం 4గంటల 58 నిమిషాలకు మొదలై 15 డిసెంబరు మధ్యాహ్నం 2గంటల 31 నిమిషాలకు సమాప్తమవుతుంది. ఈ ఏడాది ఉదయ తిథిలో మార్గశిర పౌర్ణమిని, అదే విధంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకోనున్నాం.
అన్నపూర్ణ జయంతి మహత్యం:
మార్గశిర పౌర్ణమి రోజున అన్నపూర్ణా దేవీకి అర్చన జరిపి పూజలు చేసుకుంటాం. ఈ పూజలు చేయడం వల్ల అన్నపూర్ణా దేవీ ఆశీర్వాదం దొరికి ఇంట్లో మన ఇంట ఆహారం, ధనం సమృద్ధిగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది. కొందరు ఈ రోజున వ్రతమాచరించి, విధి విధానాలు పాటించి తాము తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలని అమ్మవారిని ప్రార్థిస్తారు.
అన్నపూర్ణా దేవి ఎవరు?
ఆ దుర్గమ్మ తల్లి, పార్వతీ దేవిల రూపమని అన్నపూర్ణా దేవిని కొలుస్తారు. మనం తినే ఆహారాన్ని, శ్రేయస్సును అందించే దేవతగా భావిస్తారు. అన్నపూర్ణ దేవికి కాశీ విశ్వనాథ్ తో కలిపి ఆరాధిస్తారు. అమ్మవారు పార్వతీ దేవి అవతారంలో ఉన్న సమయంలో ఆ మహాశివుడ్ని వివాహమాడారు. అందుకే కాశీలో కూడా అన్నపూర్ణా దేవీ మందిరం ఉంది. అక్కడ ఆ తల్లిని దర్శించుకుని కోర్కెలు చెప్పుకుంటే నెరవేరతాయని భక్తుల నమ్మకం.
అమ్మవారి అవతారం:
ఒకానొక సమయంలో భూమిపై ఆహారం కొరత ఏర్పడి కరువు తాండవిస్తుంది. ఆకలి కేకలతో ప్రజలు ఆక్రందనలు చేస్తుంటారు. ఆ సమయంలో భూమిపై ప్రజలు ఒక్క ధాన్యపు గింజ కూడా దొరకదు. జనుల సమస్యలు తెలుసుకున్న బ్రహ్మ, విష్ణు యోగనిద్రలో ఉన్న పరమశివున్ని మేల్కొలిపి విషయం మొత్తాన్ని నివేదిస్తారు. దాంతో భూమిపై పర్యటించి సమస్యలను తెలుసుకున్న మహాశివుడు భూమిపై పార్వతీదేవిని అన్నపూర్ణా దేవిగా అవతారమెత్తి ప్రజల బాధను తీర్చాలని ఆదేశిస్తాడు. అప్పటి నుంచి ప్రజల అన్నార్తిని తీర్చిన తల్లిని అన్నపూర్ణా దేవిగా కొలుస్తారు.
పూజా విధానం:
అన్నపూర్ణ జయంతి రోజున వంట గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని, పొయ్యిని గంగా జలం లేదా మంచినీటితో కడిగి పవిత్రం చేసుకున్న తర్వాత పొయ్యిని తుడుచుకోవాలి. కుంకుమ, బియ్యం, పసుపు, అగరబత్తిలు, పువ్వులతో పూజ చేయాలి. అన్నపూర్ణ దేవి విగ్రహం లేదా ఫొటోను ఉంచి దీపం పెట్టాలి. ఆ రోజున అన్నపూర్ణ దేవితో పాటు భోలేనాథుని, పార్వతీదేవిలను సైతం ఆరాధించాలి. నిష్టతో, నియమాలను అనుసరించి అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని, ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదని భక్తుల విశ్వాసం.