తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  దేవుడిని ప్రతి ఒక్కరూ పూజిస్తారు.. కానీ కొందరి కోరికలు మాత్రమే నెరవేరతాయి! ఎందుకో తెలుసా?

దేవుడిని ప్రతి ఒక్కరూ పూజిస్తారు.. కానీ కొందరి కోరికలు మాత్రమే నెరవేరతాయి! ఎందుకో తెలుసా?

Ramya Sri Marka HT Telugu

02 December 2024, 10:45 IST

google News
    • ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. కానీ కొంతమంది ప్రార్థనలు మాత్రమే త్వరగా నెరవెరతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రార్థన ఎలా చేయాలి?
ప్రార్థన ఎలా చేయాలి? (AFP)

ప్రార్థన ఎలా చేయాలి?

భారతీయులకు భగవంతుడిపై నమ్మకం ఎక్కువ. వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి సంఘటన దేవుడి ఆజ్ఞతో జరుగుతుందని, దేవతల ఆశీర్వాదం ఉంటేనే వ్యక్తి సుఖంగా, సంతోషంగా జీవిస్తారనీ నమ్ముతారు. అందుకే నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ప్రార్థనలు ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ కొందరి కోరికలు మాత్రమే నెరవేరతాయి. కొంతమంది ఎంత ప్రార్థించినా ఫలితం కనిపించదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా దేవుడిని పూజించినా వారు కోరుకున్న కోరికలు నెరవేరవు. ఇలా ఎందుకు జరుగుతుందో.. ఆధ్మాత్మిక నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లేటెస్ట్ ఫోటోలు

శని సంచారంతో వీరి ఊహలు నిజమవుతాయి, అతిగా ఆలోచించడం మానుకోండి!

Dec 02, 2024, 01:11 PM

Lord Shukra: శుక్రుడి సంచారంతో నేటి నుంచి ఈ రాశుల వారికి జాతకం మారిపోతుంది

Dec 02, 2024, 12:49 PM

Nava Panchama Yogam: నవపంచమ యోగం.. ఈ మూడు రాశుల వారికి అధిక ధన లాభం

Dec 02, 2024, 12:02 PM

Filmfare OTT Awards: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో తళుక్కుమన్న సెలబ్రిటీలు.. లైగర్ బ్యూటి నుంచి తమన్నా లవర్ వరకు!

Dec 02, 2024, 11:31 AM

గజలక్ష్మీ రాజయోగంతో వచ్చే ఏడాది ఈ రాశులవారి అప్పులు తీరిపోతాయి, ఆర్థిక కష్టాలు దూరం!

Dec 02, 2024, 10:27 AM

ఈ వారంలోనే ఈ రాశుల వారికి గుడ్‍టైమ్ ప్రారంభం.. కార్య సిద్ధి, ధన ప్రయోజనాలు దక్కుతాయి!

Dec 01, 2024, 10:19 PM

ప్రార్థన ఎందుకు చేయాలి?

ఆచారాలు, పద్ధతులు వైరైనా ప్రార్థన అంటే దైవానుగ్రహాన్ని కోరుతూ, దేవుడిని సమీపించడం. అంతర్ శుద్ధితో, భక్తితో దైవ సన్నిధిలో మన కోర్కెలను, కృతజ్ఞతలను లేదా కష్టాలను వ్యక్తపరిచే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇలా చేయడం వల్ల వ్యక్తి మనసుకు ప్రశాంతత, స్థిరత్వం కలుగుతాయి. భగవంతుని సాన్నిధ్యానికి మరింత దగ్గర చేస్తుంది. వ్యక్తిలో భక్తినీ, కృతజ్ఞతా భావాన్ని పెంపొందించే అనువైన మార్గం ప్రార్థన. కష్టకాలంలో ధైర్యాన్ని, సహనాన్ని పెంచుతుంది. అన్నింటి కన్నా ముఖ్యంగ ప్రార్థన అనేది దైవంతో మానసిక, ఆధ్యాతక్మిక సంబంధాన్ని బలపరుస్తుంది.

ప్రార్థన ఎలా చేయాలి?

దేవుడిని ప్రార్థించేటప్పుడు భక్తుడు శుద్ధమైన హృదయంతో పాపముక్తంగా, స్వచ్ఛంగా ఉండాలి. దైవం పట్ట గాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. పవిత్ర సమయాల్లో చేస్తే పూజకు మరింత ఫలితం దక్కుతుంది. దైవనామస్మరణ, స్త్రోత్రాలు, మంత్రాలు చదవాలి. కొంత సమయమైన మౌనంగా, నిష్టగా ఉండి దైవచింతనలో లీనమవ్వాలి.

కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏం చెయ్యాలి.?

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వారి కోరికలు నెరవేరకపోవడానికి కారణం వారి విశ్వాస లోపం. దైవం అనుగ్రహం పొందాలంటే భక్తుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం విశ్వాసం. ప్రార్థన అంటే కేవలం కోరిక మాత్రమే కాదు. చేసేటప్పుడు ముందు మీరు దేవుడిని నమ్మాలి. మీరు కోరుకున్న కోరిక కచ్చితంగా నెరవేరుతుందని విశ్వసించాలి. ఇది సానుకూల దృక్పథంతోనే ఉండాలి. ఫలితం దైవానికే వదిలెయ్యాలి కానీ దాన్ని మీరు శుభఫలితాలను కచ్చితంగా నమ్మాలి.

కుంభకర్ణుడి కథ..

ప్రార్థన లేదా పూజ గురించి రామాయణంలో ఓ కథ ప్రస్తావనలో ఉంది. ఒకానొక సందర్భంలో కుంభకర్ణుడు బ్రహ్మ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. కుంభకర్ణుడి తపస్సుకు ప్రసన్నమైన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయి వరం కోరుకోమని అడుగుతాడు. అయితే కుంభకర్ణుడు శక్తివంతుడు, మహా భోజన ప్రియుడు కావడం వల్ల దేవతలు అతని కోరికల గురించి భయాందోళన చెందారు. ముఖ్యంగా ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోతాననే భయంతో, అతడి ఆశయాలు అవాస్తవంగా ఉండాలని ఆశించాడు. దేవతల వేడుకపై సరస్వతీ దేవి స్పందించి.. కుంభకర్ణుడు బ్రహ్మను అడిగే సమయంలో అతడి నాలుకను ముడిచింది. కుంభ కర్ణుడు ఆ సమయంలో తనకు ఇంద్రాసనం కావాలని కోరుకోవాలనుకున్నాడు. కానీ, అతని నాలుక ముడుచుకోవడం వల్ల “ఇంద్రాసనం” స్థానంలో “నిద్రాసనం” అని పొరపాటుగా పలికాడు. ఇంద్రాసనం అంటే దేవేంద్రుడి సింహాసనం. నిద్రాసనం అంటే అంతులేని నిద్ర స్థితి. బ్రహ్మకు ఆయన మాటల్లో అవకతవకల గురించి అనుమానం రాలేదు, కాబట్టి వెంటనే నిద్రాసనం వరంగా ఇచ్చాడు. ఈ పొరపాటును ఆలస్యంగా గ్రహించాడు. కానీ బ్రహ్మ ఇచ్చిన వరాన్ని తాను తిరస్కరించలేకపోయాడు. ఫలితంగా అతనికి అంతులేని నిద్ర శాపంగా మారింది. ఏడాదిలో ఆరు నెలలు నిద్రించి తర్వాత మేల్కొనడానికి బ్రహ్మ అనుమతి ఇచ్చాడు. మిగతా సమయమంతా అతడు లోతైన నిద్రలో ఉండేవాడు.

ఈ కథా సారాంశం ఏంటంటే.. దైవాన్ని కోరే కోరికలు ఎప్పుడూ స్పష్టమైనవిగా ఉండాలి. దేవతలు మానవుల చర్యల్ని పర్యవేక్షించడంలో చురుకుగా ఉంటారని బోధ. శక్తివంతమైన శరీరం, బలమైన కోరికలు ఉంటే సరిపోదు దానికి కావలసిన మానసిక దృఢత్వం వ్యక్తికి తప్పక అవసరం. కొన్నిసార్లు దైవ ప్రసాదం కూడా మన ఆలోచనల నిర్లక్ష్యానికి శిక్షగా మారవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం