తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కొత్తగా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాలు పొంగించడం వెనుక ఎంత అర్థం ఉందో తెలుసా?

కొత్తగా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాలు పొంగించడం వెనుక ఎంత అర్థం ఉందో తెలుసా?

Gunti Soundarya HT Telugu

29 October 2024, 10:46 IST

google News
    • నూతన ఇంట్లో గృహప్రవేశం అయినా, అద్దె ఇంట్లోకి అడుగు పెడుతున్నా పాలు పొంగించి పరమాన్నం చేయడం సంప్రదాయం. ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా?
కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు?
కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు? (pinterest)

కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు?

హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది. సాధారణంగా కొత్త ఇంట్లోకి లేదా అద్దె ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా పాలు పొంగించిన తర్వాత పూజ నిర్వహించుకుంటారు. ముఖ్యంగా కొత్తగా ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వాళ్ళు ఈ ఆచారం తప్పనిసరిగా పాటిస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

Happy Rasis: స్థానాలు మారుతున్న ప్రధాన గ్రహాలు, ఈ రాశుల వారి జీవితంలో ఇలాంటి భారీ మార్పులు

Dec 12, 2024, 08:51 AM

Smriti Mandhana Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. ఆస్ట్రేలియాతో వన్డేలో వరల్డ్ రికార్డు

Dec 12, 2024, 07:46 AM

2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు.. డబ్బుతోపాటుగా అదృష్టం కూడా వెంట వస్తుంది!

Dec 12, 2024, 06:08 AM

Google MoU With AP Govt : ఏపీలో గూగుల్ పెట్టుబడులు, విశాఖలో ఐటీ అభివృద్ధికి ఎంవోయూ

Dec 11, 2024, 10:03 PM

Dangerous roads: అడ్వెంచర్స్ మీకు ఇష్టమా? అయితే.. ఈ రోడ్లపై డ్రైవ్ చేయండి చూద్దాం..!

Dec 11, 2024, 07:39 PM

Cold wave: ఉత్తర భారతంపై చలి పంజా; వణుకుతున్న ఢిల్లీ; కశ్మీర్లో హిమపాతం

Dec 11, 2024, 07:02 PM

పాలు ఎందుకు పొంగిస్తారు?

ఇంటి ఆడబిడ్డతో పాలు పొంగించి పరమాన్నం తయారు చేయించి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా పాలు పొంగించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. పాలు పొంగినంతగా ఇల్లు పొంగాలనే ఉద్దేశంతో ఇంటి ఆడపడుచుతో ఇలా చేయిస్తారు. కొత్త గిన్నె కొనుగోలు చేసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో పాలు పోసి పొంగిస్తారు. అవి ఎంత బాగా పొంగితే అంతగా అదృష్టమని అందరూ విశ్వసిస్తారు. స్టవ్ మీద నుంచి కింద పడిన పాలు అన్ని వైపులా వ్యాపించేలా వెళ్తే ఇంకా మంచి జరుగుతుందని నమ్మకం.

తూర్పు దిశలో పొయ్యి వెలిగించి ఈ తంతు చేపడతారు. ఈ కార్యక్రమానికి ఎక్కువగా ఆవు పాలు ఉపయోగిస్తారు. ఇవి చాలా శ్రేష్టమైనవి. పాలు పొంగినంతగా ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం పొంగాలని కోరుకుంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. గోమాతను దేవతల స్వరూపంగా భావిస్తారు. అందుకే కొత్తగా ఇంట్లోకి ప్రవేశించే ముందు గోమాతతో గృహ ప్రవేశం చేయిస్తారు. ఇక ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇది మాత్రమే కాదు పాలు చంద్రుడికి సంబంధించినవిగా భావిస్తారు. పాలు పొంగించడం వల్ల చంద్రుడి చల్లని ఆశీస్సులు కుటుంబం మీద ఉంటాయని ఇల్లు ప్రశాంతంగా ఆనంద నిలయంగా మారుతుందని విశ్వసిస్తారు. అందుకే గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగిస్తారు. సంపదలకు అధిదేవతగా లక్ష్మీదేవిని కొలుస్తారు. సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది. సాక్షాత్తూ నారాయణుడి సతీమణి. శ్రీహరి విష్ణు నివాసం పాల సముద్రం మీద ఉంటుంది. అందుకే పాలు పొంగిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఆ ఇంటి మీద పుష్కలంగా ఉంటుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.

ఇంటి ఆడబిడ్డతో ఎందుకు చేయిస్తారు?

పాలు పొంగించే కార్యక్రమం ఇంటి ఆడబిడ్డ చేతుల మీదుగానే జరుగుతుంది. ఎందుకంటే ఆడపిల్లను పెళ్లి చేసి మరొక ఇంటికి కోడలిగా పంపిస్తారు. అలా పంపించడం వల్ల పుట్టింటికి దూరం అయ్యాను అనే బాధ అమ్మాయికి ఉంటుంది. ఆ బాధ తీర్చడం కోసం ఇంట్లో నీ విలువ ఎప్పటికీ మారదు అని చెప్పడం కోసం ఇంటి ఆడపిల్లతోనే పాలు పొంగిస్తారు.

ఇలా చేయడం వల్ల అటు ఇంటి ఆడపిల్ల కన్నీరు తుడిచిన వాళ్ళు అవడంతో పాటు ఆమెను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. తన పుట్టింట్లో తన విలువ ఎప్పటికీ అలాగే ఉంటుందనే భావన ఆమె మనసులోనూ ఉంటుంది. సంతోషంగా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటుంది. అందుకే ఇంటి ఆడపిల్ల చేతుల మీదుగా ఈ వేడుక నిర్వహిస్తారు. ఇది మాత్రమే కాదు పెళ్లి తంతులో కూడా ఆడబిడ్డ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం