తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tilakam: ఎటువంటి తిలకం పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో తెలుసా?

Tilakam: ఎటువంటి తిలకం పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో తెలుసా?

Gunti Soundarya HT Telugu

16 October 2024, 18:06 IST

google News
    • Tilakam: పసుపు, కుంకుమ, చందనంతో నుదుట తిలకం ధరిస్తారు. తిలకం ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అయితే ఈ మూడింటికి ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఎలాంటి తిలకం ధరించడం వల్ల ఆరోగ్యం, సంపద, విజయం చేకూరతాయో తెలుసుకుందాం. 
ఎలాంటి తిలకం ధరించాలి?
ఎలాంటి తిలకం ధరించాలి? (pexels)

ఎలాంటి తిలకం ధరించాలి?

తిలకం ధరించే సంప్రదాయం హిందూ సంస్కృతిలో అపారమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇది కేవలం అందాన్ని ఇచ్చేది మాత్రమే కాకుండా లోతైన ప్రాముఖ్యత కలిగి ఉండి. ఇది ఆధ్యాత్మికతను సూచిస్తుంది. మూడవ కన్ను ఆగ్న్య చక్రాన్ని సూచిస్తుంది. మనలోని ఆధ్యాత్మిక స్పృహను మేల్కోలుపుతుంది. ఆచారాలు, ప్రార్థనలు, ధ్యానం సమయంలో దైవిక శక్తులతో సంబంధాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు.

లేటెస్ట్ ఫోటోలు

AP Rains Update: బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, ఆంధ్రాను వీడని వానలు, రెండు మూడు రోజుల్లో మరో అల్పపీడనం

Dec 24, 2024, 10:56 AM

Shani: శుక్రుడు శని గ్రహాల సంయోగం.. 2025లో ఈ రాశుల వారికి జాక్ పాట్.. ఆర్థిక లాభం, వాహన యోగంతో పాటు ఎన్నో

Dec 24, 2024, 10:40 AM

Lunar Eclipse 2025: మనదేశంలో కొత్త ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం, ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Dec 24, 2024, 10:15 AM

Strange Christmas: ఇక్కడ క్రిస్మస్‌ను ఎంతో వింతగా నిర్వహించుకుంటారు, తెలిస్తే వావ్ అంటారు

Dec 24, 2024, 09:48 AM

ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు- సరైన సమయంలో ధన లాభం, అన్ని కష్టాలు దూరం..

Dec 24, 2024, 06:00 AM

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - దరఖాస్తుదారుడి వద్ద ఉండాల్సిన వివరాలు, పత్రాలివే..!

Dec 24, 2024, 05:02 AM

భక్తి, సాంస్కృతిక కట్టుబడి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణకు చిహ్నంగా పని చేస్తుంది. నుదురు బ్రహ్మ స్థానంగా పరిగణిస్తారు. అందుకే ఈ స్థానంలో తిలకం పెట్టుకుంటారు. నుదుటి మీద బొట్టు పెట్టుకున్న వారిని చూడగానే చూడముచ్చటగా అనిపిస్తాయి. పవిత్రమైన భావన కలుగుతుంది. వారికి గౌరవం ఇస్తారు. తిలకం అనగానే కుంకుమతో ధరించేదని ఎక్కువగా భావిస్తారు. ఏకాగ్రతను, దృష్టిని పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది దైవంతో మనల్ని మరింత కనెక్ట్ చేస్తుంది. కానీ తిలకం అనేక రకాలుగా ఉంటుంది. వాటి ప్రయోజనాలు ఏంటి? అనేది గురించి తెలుసుకుందాం.

గంధపు చెక్క తిలకం

అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో చందనం తిలకం ఒకటి. గంధం పేస్ట్ ను నుదుటిపై పూయడం వల్ల శరీరం మీద శీతలీకరణ ప్రభావం చూపిస్తుంది. ఆగ్న్య చక్రం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఇది ఎండిపోయిన తర్వాత ప్రార్థన సమయంలో కేంద్ర బిందువుగా పని చేస్తుంది. ఏకాగ్రతకు సహాయపడుతుంది. గంధం సువాసన పిట్యూటరీ గ్రంధులకు దాని ప్రభావాన్ని విస్తరించి వాటి పనితీరును ప్రోత్సహిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చందనం గ్రంథులను నియంత్రిస్తుంది. ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మీలోని శక్తిని ప్రేరేపిస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

కుంకుమ తిలకం

కుంకుమ తిలకం ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది అంతర్గత సౌందర్య ఆకర్షణకు మించి ఉంటుంది. విభిన్న సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని అందిస్తుందని నమ్ముతారు. మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఈ తిలకం దృష్టిని పెంచుతుంది. మానసిక శక్తులను మేల్కోలుపుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. మిమ్మల్ని సరైన మార్గంలో నడిచేందుకు అవసరమైన శక్తిని అందిస్తుంది. సంపూర్ణ పరివర్తనను అందిస్తుంది. కొంతమంది కుంకుమ తిలకం పెట్టించుకున్న తర్వాత దాని మీద బియ్యం గింజలు కూడా పెడతారు. ఇది ఆధ్యాత్మికను సూచిస్తుంది. కుంకుమ తిలకం విజయం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది

పసుపు తిలకం

పసుపు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రభావవంతమైన తిలకం. పసుపును నుదుటి మీద తిలకంగా అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ తిలకం సంప్రదాయం ప్రతిబింబించడమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆత్మకు ఔషధంగా పని చేస్తుంది. చర్మాన్ని సున్నితంగా శుభ్రపరుస్తుంది. మనసును శుద్ధి చేస్తుంది. మెరుగైన ఆత్మవిశ్వాసానికి మార్గం సుగమం చేస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం