Tilakam Bottu : నుదుటిపై తిలకం ఎందుకు పవిత్రమైనది?
Tilakam Bottu : హిందూ మతంలో నుదుటిపై తిలకం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. పూజా సమయంలో, ఇతర మతపరమైన కార్యక్రమాల సమయంలో ఉపయోగిస్తారు? ఇది ఉపయోగించడం ముఖ్య ఉద్దేశం ఏంటి?
తిలకం హిందూమతంలో చాలా ముఖ్యమైనది. తప్పనిసరిగా పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. అయితే తిలకం బొట్టును చాలా పవిత్రంగా భావిస్తారు హిందూవులు. ఇది పెట్టుకుంటే.. ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించే వ్యక్తి, దాని ప్రకారం జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. ఇది కాకుండా, తిలకం ఉపయోగం.. దేవతల దయ మనపై ఉంటుందని తెలుపుతుంది.
తిలకం దేవుని శక్తి, దీవెనలు పొందేందుకు ఒక మార్గంగా భావిస్తారు. అందుకే నుదుటిపై తిలకం హిందూమతంలో ఒక ముఖ్యమైన ఆచారం. మతపరంగా, సామాజికంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూమతంలో తిలకం పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తికి దైవత్వం, ఆధ్యాత్మిక భావాన్ని ఇస్తుంది.
తిలకంలో ఉపయోగించే రంగులు కూడా వాటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఎరుపు లేదా కుంకుమ రంగును శ్రీవత్స లేదా విష్ణువు యొక్క చక్రాన్ని సూచించడానికి తిలకంలో ఉపయోగిస్తారు. శివునికి ప్రతీకగా విభూతి ఉపయోగిస్తారు. హిందూ మతంలో తిలకం ఉపయోగం దేవుని అధికారానికి చిహ్నంగా ఉంది. ఇది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా, దేవునికి దగ్గరగా ఉండేలా చేస్తుంది.
నుదుటిపై తిలకం పెట్టుకోవడం, మతపరంగా ముఖ్యమైనది. వ్యక్తిత్వంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ తిలకం వ్యక్తి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తిలకాన్ని ఉపయోగించడం ఆధ్యాత్మిక దృక్కోణం నుండి సంతృప్తి ఇస్తుంది. అంతే కాకుండా తిలకం పెట్టుకుంటే వ్యక్తి మానసిక శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది.
నుదుటిపై తిలకం పూయడం వల్ల అంతర్గత శాంతి, స్థిరత్వం లభిస్తుంది. తిలకం పెట్టుకోవడం వల్ల మెదడుకు ఏకాగ్రత పెరుగుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. దీని ద్వారా, వ్యక్తి ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతాడు. అతని స్వరం కూడా మృదువుగా ఉంటుంది.
టాపిక్