Chaturgrahi yogam: సూర్య గ్రహణం రోజు కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం- ఈ రాశులకు శుభదాయకం
27 September 2024, 11:00 IST
- Chaturgrahi yogam: సూర్య గ్రహణం రోజు గ్రహాల స్థానం చాలా కీలకంగా మారబోతుంది. గ్రహాల సంచారం వల్ల కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే వివరాల గురించి తెలుసుకుందాం.
కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం
Chaturgrahi yogam: ఈ సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 మంగళవారం సర్వపితృ అమావాస్య రోజున జరుగుతుంది. సూర్యగ్రహణం రోజున గ్రహాలు, నక్షత్రాల స్థానం ప్రత్యేకంగా ఉండబోతోంది.
ఈ రోజున కన్యా రాశిలో నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వల్ల చతుర్గ్రాహి యోగం కలుగుతుంది. అయితే శని దాని స్వంత రాశిలో రివర్స్ అంటే తిరోగమన కదలికలో కదులుతోంది. సూర్యగ్రహణం రోజున ఏ గ్రహాలు చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తాయి? కన్యా రాశిలో గ్రహాల స్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం రోజున గ్రహాల స్థానం ఎలా ఉంటుంది?
సూర్యగ్రహణం రోజున సూర్యుడు, బుధుడు, చంద్రుడు, కేతువులు కన్యా రాశిలో ఉంటారు. ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. గ్రహాల స్థానం గురించి పండితులు ఈ విధంగా తెలిపారు. సూర్యగ్రహణం రోజున బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడు. మిథున రాశిలో కుజుడు సంచరిస్తున్నారు.
కన్యా రాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు, కేతువు కలయిక జరగబోతుంది. దీని వల్లే ఈ యోగం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం కూడా కన్యా రాశిలో జరగబోతుంది. అందువల్ల కన్యా రాశి వారికి ఈ రెండింటి ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంటుంది. సంపదను ఇచ్చే శుక్రుడు తులా రాశిలో సంచరిస్తున్నాడు. తిరోగమనంలో శని కుంభ రాశిలో ఉండి రాహువు మీన రాశిలో సంచరిస్తున్నాడు.
సూర్యగ్రహణానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు
అక్టోబరు 2న సంభవించే సూర్యగ్రహణం వార్షిక సూర్యగ్రహణం. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో రింగ్ ఆఫ్ ఫైర్ వీక్షణను కూడా చూడవచ్చు. అయితే ఈ గ్రహణం సంభవించే సమయంలో ఇది భారతదేశంలో రాత్రి అవుతుంది. దీని కారణంగా దేశంలో ఈ గ్రహణం కనిపించదు. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 09:13 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 03:17 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించని కారణంగా దాని సూతక్ కాలం కూడా చెల్లదు.
సూర్యగ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుంది?
ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం భారత్ లో కనిపించదు. కానీ అర్జెంటీనా, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికా, పెరూ, ఫిజి మరియు ఆర్కిటిక్ వంటి ప్రాంతాలలో ఈ గ్రహణం చూడవచ్చు.
ఈ రాశులకు శుభదాయకం
సూర్య గ్రహణం ప్రభావం మూడు రాశుల వారికి శుభదాయకంగా ఉంటుంది. మేషం, మిథునం, సింహ రాశుల వారికి మేలుకరమైన ప్రయోజనాలు అందిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాలు లాభాలను ఇస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. భూమి, ఆస్తుల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో విజయాలు సాధిస్తారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.