Chaturgrahi yogam: కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం, ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట కాలం రాబోతుంది-chaturgrahi yogam in kanya rashi four zodiac signs will shine in september month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chaturgrahi Yogam: కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం, ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట కాలం రాబోతుంది

Chaturgrahi yogam: కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం, ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట కాలం రాబోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 23, 2024 04:05 PM IST

Chaturgrahi yogam: సెప్టెంబర్ నెలలో కన్యా రాశిలో గ్రహాల జాతర జరగబోతుంది. ఒకే రాశిలో నాలుగు గ్రహాల సంయోగం కారణంగా కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీంతో నాలుగు రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు.

కన్యారాశిలో చతుర్గ్రాహి యోగం
కన్యారాశిలో చతుర్గ్రాహి యోగం (freepik)

Chaturgrahi yogam: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్రాలను మారుస్తాయి. మేషం నుండి మీనం వరకు 12 రాశుల మీద కూడా వీరి శుభ, అశుభ ప్రభావం ఉంటుంది. 

సెప్టెంబర్ 2024 నెల గ్రహ సంచారాల పరంగా చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో కన్యారాశిలో గ్రహాల జాతర జరగబోతోంది. దీని కారణంగా అనేక శుభ యాదృచ్చికలు జరుగుతాయి. ఇది కొన్ని రాశుల జీవితాల్లో విపరీతమైన మార్పులను తెస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ నెలలో మొదటగా 4వ తేదీన గ్రహాల యువరాజు బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. తరువాత సెప్టెంబర్ 23 న అది కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. 

సెప్టెంబర్ 16న సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో శుక్రుడు ఆగస్టు 25 నుండి కన్యా రాశిలో ఉన్నాడు. సెప్టెంబర్ 18 వరకు ఈ రాశిలో ఉంటాడు. అంతుచిక్కని గ్రహం కేతువు 2023 నుండి కన్యా రాశిలో ఉన్నాడు. ఈ సంవత్సరం తన రాశిని మార్చడు. సెప్టెంబర్ నెలలో శుక్ర, బుధ, సూర్య, కేతువుల రాకతో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. సెప్టెంబర్ నెల మీ జీవితంలో కొత్త సానుకూల మార్పులను తెస్తుంది. జీవితం ఆనందంతో వికసిస్తుంది. కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం ఏ రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుందో తెలుసుకుందాం. 

మేష రాశి

సెప్టెంబర్ నుంచి మేష రాశి వారి ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉంటాయి. కెరీర్‌లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. జీవితం సుఖాలు, విలాసాలతో గడిచిపోతుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. ఉద్యోగస్తులు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్‌ను పొందవచ్చు.

సింహ రాశి 

సెప్టెంబర్‌లో చతుర్గ్రాహి యోగం సింహ రాశి వ్యక్తుల జీవితాల్లో అద్భుత మార్పులను తెస్తుంది. ఈ సమయంలో మీరు అదృష్టం పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. సామాజిక హోదా, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది.

కన్యా రాశి 

చతుర్గ్రాహి యోగం కన్యా రాశి వారికి జీవితంలోని ప్రతి విషయంలోనూ పురోభివృద్ధిని కలిగిస్తుంది. మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉంటాయి. మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితంలో ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి.

ధనుస్సు రాశి 

సెప్టెంబర్ నెల నుండి ధనుస్సు రాశి వారికి ఆగిపోయిన పనులన్నీ పునః ప్రారంభమవుతాయి. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ కలలన్నీ నిజమవుతాయి. మీరు మీ కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు విదేశాలలో పని చేయడానికి ఆఫర్ పొందవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మధురంగా ​​ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.