Mercury transit: కన్యా రాశిలోకి బుధుడు- ఆరు రాశుల వారికి అధిక ప్రయోజనాలు, అందులో మీ రాశి ఉందా?-mercury virgo transit in pitru paksha know which 6 zodiac signs will benefit ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: కన్యా రాశిలోకి బుధుడు- ఆరు రాశుల వారికి అధిక ప్రయోజనాలు, అందులో మీ రాశి ఉందా?

Mercury transit: కన్యా రాశిలోకి బుధుడు- ఆరు రాశుల వారికి అధిక ప్రయోజనాలు, అందులో మీ రాశి ఉందా?

Gunti Soundarya HT Telugu
Sep 19, 2024 11:00 AM IST

Mercury transit: పితృ పక్షం సమయంలో గ్రహాల రాకుమారుడు బుధుడు తన రాశిని మారుస్తాడు. బుధుడి రాశి మార్పు మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. బుధుడు కన్యా రాశికి వెళ్లడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.

బుధుడి సంచారం
బుధుడి సంచారం

Mercury transit: సెప్టెంబర్ నెలలో బుధుడు రెండు సార్లు తన రాశిని మారుస్తాడు. గ్రహాల రాకుమారుడైన బుధుడు సెప్టెంబర్ 4న సింహ రాశిలోకి ప్రవేశించాడు. అనంతరం 23 సెప్టెంబర్ 2024న సింహ రాశి నుండి బయటకు వెళ్లి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో పితృ పక్షం జరుగుతోంది. పితృ పక్షం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు ఉంటుంది.

కన్యా రాశిలో బుధుడు సంచరించడం వల్ల మానవ జీవితంపై ప్రభావం చూపుతుంది. బుధుడు కన్యా రాశి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగానూ, ఇతర రాశులకు సాధారణంగానూ ఉంటుంది. కన్యారాశిలో బుధుడి సంచారం ఆరు రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు బుధ సంచార కాలంలో అనుకూల ఫలితాలు పొందుతారు. కన్యా రాశిలో బుధుడు సంచారం ఏ రాశికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.

సొంత రాశిలోకి బుధుడు

బుధుడు కన్యారాశిని పాలించే గ్రహం. అటువంటి పరిస్థితిలో దాని స్వంత రాశిలో బుధుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బుధుడు భాద్రపద మాసం కృష్ణ పక్ష షష్ఠి తిథి అయిన 23 సెప్టెంబర్ 2024, సోమవారం ఉదయం 09:30 గంటలకు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు.

తెలివితేటలు, వ్యాపారం, స్నేహితులు మొదలైన వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. ఒక రాశిలో బుధుడు 21 రోజుల పాటు ఉంటాడు. అత్యంత వేగంగా రాశిని మార్చే గ్రహంగా బుధుడికి పేరు ఉంది. కన్యా రాశిలో బుధుడి సంచారంతో రాజయోగం ఏర్పడుతుంది. అక్కడ ఇప్పటికే శుక్రుడు సంచరిస్తున్నాడు. శుక్ర, బుధ కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి కన్యా రాశిలో బుధుని సంచారం బాగానే ఉంటుంది.

ఈ రాశుల వారికి కన్యారాశిలో బుధుడు సంచరించడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. బుధగ్రహ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారం చేసే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం వస్తుంది. బుధ సంచార ప్రభావం వల్ల వీరికి వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ కాలంలో పనిలో విజయం లభిస్తుంది. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. వ్యాపారులకు ఈ కాలం మేలు చేస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది.

అక్టోబరు 10న బుధుడు కన్యా రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. తులా రాశిలో బుధుని సంచారం దేశంతో పాటు మానవ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.