Budhaditya yogam: కన్యా రాశిలో బుద్ధాదిత్య యోగం- ఈ రాశులకు వరం, వ్యాపారులకు మంచి లాభాలు
Budhaditya yogam: సెప్టెంబర్ నెలలో సూర్య,బుధ గ్రహాలు కలిసి అద్భుతమైన బుద్ధాదిత్య యోగాన్ని సృష్టించబోతున్నారు. దీని వల్ల మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భారీ లాభాలు కలుగుతాయి. తెలివితేటలు పెరుగుతాయి.
Budhaditya yogam: ఒక వ్యక్తి జీవితం మీద గ్రహాల సంచార ప్రభావం అధికంగానే ఉంటుంది. నవగ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత సంచారం చేస్తాయి. అలా ఇతర గ్రహాలతో కలిసి కలయికను ఏర్పరుస్తాయి. ఇది శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంది. సెప్టెంబర్ లో సూర్యుడు, బుధుడు కలిసి బుద్ధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
16 సెప్టెంబర్ 2024న సూర్యుడు రాత్రి 07:29 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే 23 సెప్టెంబర్ 2024నబుధుడు ఉదయం 09:59 గంటలకు ఇదే రాశిలోకి ప్రవేశిస్తాడు. 23 సెప్టెంబర్ 2024న కన్యా రాశిలో బుధుడు, సూర్యుడి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అక్టోబర్ 17 వరకు ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడు గౌరవం, స్థానం, కీర్తి, ప్రతిష్టలను సూచిస్తాడు. సూర్యుని అనుగ్రహం వల్ల వృత్తిలో విజయం లభిస్తుంది. బుధ గ్రహం వాక్కు, తెలివితేటలకు కారకుడు. బుధ గ్రహం శుభ ఫలితాలను అందించినప్పుడు ఒక వ్యక్తి వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందవచ్చు. జ్ఞానం కూడా గణనీయంగా పెరుగుతుంది. బుధాదిత్య యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. అది ఏ రాశులకో తెలుసుకుందాం.
సింహ రాశి
సింహ రాశి సంపద, వాక్కు గృహంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. మీ ప్రణాళికలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో పరిచయం అవుతుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశాన్ని పొందుతారు. అలాగే భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. మేధో సామర్థ్యం పెరుగుతుంది. గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది.
వృశ్చిక రాశి
బుధాదిత్య యోగం వృశ్చిక రాశి ఆదాయ, లాభ గృహంలో ఏర్పడుతుంది. ఇది వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ స్థాయిలలో విపరీతమైన పెరుగుదలను చూస్తారు. ఈ కాలంలో వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారస్తులకు ఈ యోగం వల్ల అనుకూలమైన లాభాలు కలుగుతాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇవి మీ జీవితంలో పురోగతికి దోహదపడతాయి. కార్యాలయంలో పై అధికారులతో, సహోద్యోగులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ప్రణాళికలు, వ్యూహాలు విజయవంతమయ్యే సంకేతాలు ఉన్నాయి.
మకర రాశి
బుధాదిత్య యోగం మకర రాశి వారి అదృష్టం ఇంట్లో ఏర్పడుతుంది. దేశ, విదేశాలకు ప్రయాణాలు చేస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. అన్నీ రకాల భౌతిక ఆనందాలు అనుభవిస్తారు. అదృష్టం పూర్తి మద్ధతు ఉంటుంది. ఉద్యోగస్తులు తమ వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ఈ కాలంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి వారి ప్రయాణాలు శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటాయి. మతపరమైన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. డబ్బు ఆదా చేసుకోగలుగుతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.