Lord ganesha: వినాయక చవితికి ఈ లక్కీ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి- విజయం, అదృష్టం లభిస్తాయి-bring these items on the occasion of vinayaka chavithi for success and prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Ganesha: వినాయక చవితికి ఈ లక్కీ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి- విజయం, అదృష్టం లభిస్తాయి

Lord ganesha: వినాయక చవితికి ఈ లక్కీ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి- విజయం, అదృష్టం లభిస్తాయి

Gunti Soundarya HT Telugu
Sep 06, 2024 02:15 PM IST

Lord ganesha: సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అన్నీ వీధులు గణేష్ మండపాలతో సందడిగా ఉన్నాయి. ఈ పండుగ సందర్భంగా ఇంటికి కొన్ని లక్కీ వస్తువులు తెచ్చుకోండి. ఇవి మీకు విజయం, అదృష్టాన్ని అందిస్తాయి.

వినాయక చవితికి వీటిని ఇంటికి తీసుకురండి
వినాయక చవితికి వీటిని ఇంటికి తీసుకురండి (pixabay)

Lord ganesha: దేశమంతా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. మార్కెట్లు అన్నీ పండుగ సామాన్లతో నిండిపోయాయి. పూజకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ అందరూ సంతోషంగా షాపింగ్ చేసుకుంటూ ఉండటంతో కోలాహల వాతావరణం నెలకొంది. 

చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ రేపు అంటే సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజు కొన్ని పవిత్రమైన వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు ఈ చవితికి ముందే మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. 

ఈ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవునా విజయం, సంపద, ఆనందాన్ని ఇస్తాయని విశ్వసిస్తారు. మీ ఇంటికి విజయం, శ్రేయస్సును ఆకర్షించేందుకుఈ పవిత్రమైన వస్తువులను పండుగకు ముందే ఇంటికి తీసుకువచ్చి పెట్టుకోండి. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం వీటిని తీసుకురావడం వల్ల మీకు జీవితంలో డబ్బుకు కొదవ అనేది ఉండదు. వినాయకుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. 

శంఖం

శంఖంలో లక్ష్మీదేవి నివసిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వినాయక చవితికి మీరు శంఖాన్ని ఇంటికి తీసుకురండి. ప్రతిరోజు వినాయకుడికి హారతి ఇచ్చిన తర్వాత శంఖాన్ని ఊదాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మనసులోనూ ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. 

శుభ్ లాభ్ యంత్రం

ఇది ఒక పవిత్రమైన రేఖాగణిత యంత్రం. సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. అందుకే ఈ పండుగ సమయంలో మీరు సానుకూలత, విజయాన్ని ఆహ్వానించేందుకు శుభ్ లాభ్ యంత్రాన్ని తీసుకురండి. దీన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉత్తరం లేదా తూర్పు దిశలో వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిండిపోతుంది.

పంచధాతు గంట

వినాయక చవితి సందర్భంగా మీరు ఇంటికి పంచధాతు గంటను తీసుకురావచ్చు. ఇది అయిదు లోహాలతో తయారుచేస్తారు. దీని నుంచి విలువడే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. సానుకూలతను ఆకర్షిస్తుంది. అదృష్టం, శ్రేయస్సును ఆకర్షించేందుకు మీరు ప్రవేశ ద్వారం దగ్గర ఈశాన్య మూలలో దీన్ని  వేలాడదీయవచ్చు. 

తామర పువ్వులు

ఆధ్యాత్మిక వాతావరణం, స్వచ్ఛతను సూచించే తామర పువ్వులు కూడా తెచ్చుకోవచ్చు. ఇవి సానుకూలతను, అదృష్టాన్ని ఇస్తాయి. శాంతి, శ్రేయస్సును కోసం వినాయకుడి విగ్రహం దగ్గర ఈశాన్య దిశలో ఈ తామర పువ్వులు పెట్టవచ్చు.

కలశం

వినాయకుడి పూజలో కలశాన్ని నీటితో నింపి దాన్ని మామిడి ఆకులు కొబ్బరికాయతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల సమృద్ధి, శ్రేయస్సును సూచిస్తుంది.  సానుకూల శక్తిని, ఆశీర్వాదాలు ఇస్తుంది. ఈ కలశాన్ని గణేశుడి విగ్రహం దగ్గర ఈశాన్య దిశలో ఉంచాలి. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.