Vinayaka chavithi 2024: వినాయక చవితి నాడు గణేశుడికి గరికను ఎందుకు సమర్పిస్తారు?పూజలో ఎన్నిజతలు ఉంచాలి?
Vinayaka chavithi 2024: వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉండేది దుర్వా గడ్డి. దీన్ని దర్భ గడ్డి, గరిక, కుశల గడ్డి అని కూడా పిలుస్తారు. గణపతి పూజలో ఈ దుర్వా ఉంటే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే వినాయకుడికి ఇది ఎందుకంత ప్రీతికరమైనదిగా మారిందో తెలుసుకుందాం.
Vinayaka chavithi 2024: వినాయక చవితి ఉపవాసం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి రోజున ఆచరిస్తారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 7న నిర్వహించనున్నారు. ఈ రోజు గణపతిని ఏ సమయంలోనైనా ప్రతిష్టించవచ్చు. గణేష్ చతుర్థి నాడు భక్తుల బాధలను తొలగించేందుకు బప్పా భూమికి వస్తాడని చెబుతారు.
ఈ రోజున శుభ సమయంలో గణపతిని ప్రతిష్టించండి. గంగా జలంతో వినాయకుడికి అభిషేకం చేయాలి. కుంకుమ, గంధపు తిలకం పూయండి. పసుపు పూల దండను సమర్పించండి. మోదకం నైవేద్యం సమర్పించాలి. దేశీ నెయ్యి దీపం వెలిగించండి. ఈ రోజు పూజలో దుర్వా తప్పనిసరిగా ఉండాలి. దుర్వాను ఎల్లప్పుడూ జంటగా అందించాలని పండితులు చూచిస్తున్నారు. దీనికి 11 జతల దుర్వా సమర్పించాలి.
దుర్వాను తీసుకువస్తున్నప్పుడు దాన్ని శుభ్రమైన ప్రదేశం నుండి మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. వీలైతే పూజ కోసం ఒక కుండలో దుర్వాన్ని పెంచండి. అంతే కాకుండా మురికి నీటి దగ్గర ఉన్న దుర్వాని పూజలో ఉపయోగించకూడదు. వినాయకుడికి దుర్వా లేకుండా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అసలు గణేషుడికి దుర్వా అంటే ఎందుకు అంత ప్రీతికరం, దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం.
దుర్వా ఎందుకు ఇష్టం
పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడి భీభత్సానికి అందరూ ఇబ్బంది పడ్డారు. దేవతలు కూడా అతనిని నాశనం చేయలేకపోయేంత శక్తిమంతుడు. రాక్షసుడు తన ఆకలిని తగ్గించుకునేందుకు రుషులను సైతం మింగడం ప్రారంభించాడు.
దీంతో దేవతలు, రుషులు అందరూ రక్షించమని కోరుకుంటూ పార్వతీ దేవి దగ్గరకు వస్తారు. విషయం తెలుసుకున్న వినాయకుడు లోక రక్షణ కోసం అనలాసురుడిని మింగేసాడు. దాని వల్ల గణపతికి కడుపులో మంట ఎక్కువైంది. అందరూ ఎన్నో విధాలుగా వినాయకుడి మంటను తగ్గించేందుకు ప్రయత్నించారు. కానీ అందరూ విఫలమయ్యారు. ఆ సమయంలో రుషులు గణేశుడికి తినడానికి దుర్వా గరికని ఇచ్చారు. దుర్వా తినగానే వినాయకుడికి కడుపులో మంట తగ్గింది. అప్పటి నుండి గణేశుడికి దుర్వాని నైవేద్యం పెట్టే సంప్రదాయం మొదలైంది. ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి విశేషమైన ఆశీర్వాదాలు దక్కుతాయని చెప్పాడని అంటారు. అప్పటి నుంచి వినాయకుడి పూజలో గరిక ముఖ్యమైనదిగా మారింది.
ఎలా పెట్టాలి?
వినాయకుడి పూజలో దుర్వాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలో తప్పనిసరిగా 21 దుర్వాలు సమర్పించాలి. వీటిని ముందుగా శుభ్రంగా నీటితో కడిగి ముడి వేయాలి. వినాయకుడి పాదాలకు ముందుగా దుర్వా సమర్పించాలి. మొహం తప్ప మిగతా శరీర భాగాలన్నింటిని గరికతో అలంకరించుకోవచ్చు. దుర్వాతో పూజ చేయడం వల్ల వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.