Lord ganesha: ఈ రాశులంటే వినాయకుడికి చాలా ఇష్టం, అందులో మరి మీ రాశి ఉందేమో చూసుకోండి
Lord ganesha: అందరి దేవుళ్ళకు ప్రత్యేకంగా కొన్ని రాశులు అంటే ఇష్టం ఉంటుంది. అలాగే వినాయకుడికి మూడు రాశులు అంటే మహా ప్రీతి. వీరికి ఏ పనిలోనూ అడ్డంకులు ఎక్కువ కాలం ఉండవు. వినాయకుడి అనుగ్రహంతో తమ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు.
Lord ganesha: హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగో రోజున గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. అందరి దేవుళ్ళలో మొదట పూజలు అందుకునేది వినాయకుడు. అటువంటి విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా కష్టాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకుందాం.
వినాయకుడి అనుగ్రహంతో జాతకులు జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం ద్వాదశరాశుల గురించి వివరించారు. ఈ 12 రాశులలో కొన్ని రాశుల వారికి వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వీళ్ళు ఏ పని తలపెట్టిన అందులో అడ్డంకులు సులువుగా తొలగిపోతాయి. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. వినాయకుడి అనుగ్రహంతో ఈ మూడు రాశుల వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులభంగా రాణించగలుగుతారు. అవి ఏ రాశులో చూసేయండి.
మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు వివేకం, తెలివితేటలు ఎక్కువ. వారి చర్యలు సమర్థవంతంగా ఉంటాయి. గణపతి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ రాశి వారు పనుల్లో త్వరగా విజయం సాధిస్తారు. మేష రాశికి కుజుడు అధిపతి. అందువల్ల వీరికి ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి. వీళ్ళు తమ తెలివితేటలతో ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారికి వినాయకుడి కరుణా కటాక్షాలు నిత్యం ఉంటాయి. వీళ్ళు చాలా ప్రతిభావంతులు. ఈ రాశి వాళ్ళు విద్యారంగంలో ఎక్కువ విజయాలు సాధిస్తారు. దయగల స్వభావం ఉంటుంది. ఏదైనా పని అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఈ రాశి వాళ్ళు బుధవారం నాడు వినాయకుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. అలాగే నైవేద్యంగా శనగపిండి లడ్డూలు పెట్టాలి. వినాయకుడి అనుగ్రహంతో వీరికి సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆదాయం ఉంటుంది.
మకర రాశి
మకర రాశికి శనీశ్వరుడు అధిపతి. ఈ రాశి వారికి కూడ వినాయకుడి కృప ఉంటుంది. వీళ్ళు నిజాయితీపరులుగా, విశ్వసినీయంగా ఉంటారు. తెలివైన వారుగా పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు విద్యారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ప్రతిరోజు ఈ రాశి వాళ్ళు వినాయకుడిని పూజించడం మంచిది. కష్ట సమయంలో కూడా కృంగిపోకుండా వాటిని దాటుకుంటూ వెళ్లడం వీరి ప్రత్యేక స్వభావం. ఓటమిని అంగీకరించేందుకు అసలు ఇష్టపడరు. గణపతి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.