Solar eclipse 2024: సర్వ పితృ అమావాస్య రోజు సూర్య గ్రహణం- ఆరోజు శ్రాద్ధ క్రతువులు చేసుకోవచ్చా?-will the solar eclipse of sarvapitru amavasya be visible in india which eclipse was seen in india ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Solar Eclipse 2024: సర్వ పితృ అమావాస్య రోజు సూర్య గ్రహణం- ఆరోజు శ్రాద్ధ క్రతువులు చేసుకోవచ్చా?

Solar eclipse 2024: సర్వ పితృ అమావాస్య రోజు సూర్య గ్రహణం- ఆరోజు శ్రాద్ధ క్రతువులు చేసుకోవచ్చా?

Gunti Soundarya HT Telugu
Sep 23, 2024 04:00 PM IST

Solar eclipse 2024: సర్వపితృ అమావాస్య రోజు ఈ ఏడాది చివరి చివరి సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. దీని ప్రభావం ఆరోజు జరుపుకునే శ్రాద్ధం, తర్పణాలు వంటి క్రతువుల మీద ఉంటుందా? ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. అయితే గ్రహణం భారత్ లో కనిపించకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

సూర్య గ్రహణం
సూర్య గ్రహణం

Solar eclipse 2024: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. గతంలో ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. ఈసారి సర్వపితృ అమావాస్య నాడు ఏర్పడే గ్రహణం భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా కనిపిస్తుందా, భవిష్యత్తులో భారతదేశంలో గ్రహణం ఎప్పుడు కనిపిస్తుంది? అనేది తెలుసుకుందాం.

ఈసారి పితృ పక్ష అమావాస్య నాడు ఏర్పడే గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఈ గ్రహణానికి భారతదేశంలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఈసారి ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా, ఉత్తర అమెరికాలోని ఇతర ప్రాంతాలతో సహా వివిధ దేశాలలో కనిపిస్తుంది. అందువల్ల ఈ గ్రహణం సూతక్ కాలం భారత్ లో పరిగణించబడదు. పూజకు సంబంధించి ఎటువంటి నియమాలు ఉండవు.

గ్రహణ కాలం ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2న వచ్చే భాద్రపద అమావాస్య రోజు పితృ పక్షం చివరి రోజు. దీన్నే సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ పితృ పక్షం 15 రోజులలో పూర్వీకులకు శ్రాద్ధం చేయని వారు ఈరోజు చేస్తారు. అమావాస్య నాడు పితృ దేవతలకు శ్రాద్ధం, తర్పణం వదలడం వల్ల పితృ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే వారి ఆశీర్వాదాలు లభించి సంతానం, వంశాభివృద్ధి జరుగుతుంది.

భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ ఏర్పడే గ్రహణం రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3.17 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్య గ్రహణం సుమారు 6 గంటల నాలుగు నిమిషాల పాటు ఉంటుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించకపోవడం వల్ల సూతక్ కాలం చెల్లదు. అందువల్ల ఈరోజు శ్రాద్ధ, తర్పణ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. వాటి మీద గ్రహణ ప్రభావం ఏ మాత్రం ఉండదు.

భారతదేశంలో సూర్యగ్రహణం చివరిసారిగా ఎప్పుడు కనిపించింది? రాబోయే సంవత్సరంలో భారతదేశంలో సూర్యగ్రహణం ఎప్పుడు కనిపిస్తుందో తెలుసుకోండి.

భారతదేశంలో సూర్యగ్రహణం ఎప్పుడు కనిపించింది?

చివరి సారిగా భారత్ లో సూర్యగ్రహణం డిసెంబర్ 26, 2019న కనిపించింది. ఇది 05:18:53కి ప్రారంభమై మూడు నిమిషాల 39 సెకన్ల పాటు కొనసాగింది. భారతదేశంతో పాటు ఇది ఆసియా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, సుమత్రా, బోర్నియో ప్రాంతాలలో కూడా కనిపించింది.

భారతదేశంలో సూర్యగ్రహణం ఎప్పుడు కనిపిస్తుంది?

లైవ్ మింట్ వెబ్‌సైట్ ప్రకారం ఇప్పుడు మనం రాబోయే కాలంలో భారతదేశంలో సూర్యగ్రహణం కోసం వేచి ఉండాలి. రానున్న ఐదారు సంవత్సరాల పాటు వచ్చే సూర్య గ్రహణాలు భారత్ లో కనిపించకపోవచ్చు. మే 21, 2031న భారతదేశంలో వార్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇది కొచ్చి, అలప్పుజా, చాలకుడి, కొట్టాయం, తిరువల్ల, పతనంతిట్ట, పెనవు, గూడలూర్ (తేని), తేని, మదురై, ఇళైయంగుడి, కరైకుడి, వేదారణ్యంతో సహా భారతదేశంలోని దక్షిణ భాగంలోని అనేక భారతీయ నగరాల్లో కనిపిస్తుంది. కేరళ, తమిళనాడు గగనతలంలో 'రింగ్ ఆఫ్ ఫైర్' కనిపిస్తుంది. ఇది సూర్యునిలో దాదాపు 28.87 శాతాన్ని కవర్ చేస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్