Solar Eclipse: కన్యా రాశిలో సూర్య గ్రహణం-ఈ రాశులకు శుభదాయకం, వీరిని ధనవంతులను చేస్తుంది
Solar Eclipse: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్‌లో ఏర్పడగా ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సూర్యగ్రహణంలో సూర్యుడు అగ్ని వలయంలా కనిపిస్తాడు. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.
Solar Eclipse: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్‌లో ఏర్పడగా ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. ఈరోజుతో పితృ పక్షం సమయం కూడా ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సూర్యగ్రహణంలో సూర్యుడు అగ్ని వలయంలా కనిపిస్తాడు.
ఈ ఏడాది అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు సర్వపితృ అమావాస్య. ప్రస్తుతం సూర్యుడు సింహ రాశిలో ఉన్నాడు. సెప్టెంబర్ 16న సూర్యుడు తన రాశిని మారుస్తాడు. సింహ రాశిని వీడి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి సమయంలో కన్యా రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. సూర్యగ్రహణం సంభవించినప్పుడు సూర్యుడు కన్యా రాశిలో ఉంటాడు. అక్టోబరు 2న సూర్యగ్రహణం ఏర్పడితే ఆ రోజు పితృ పక్షానికి చివరి రోజు. దీనిని సర్వపితృ అమావాస్య అంటారు.
ఈసారి రింగ్ ఆఫ్ ఫైర్ ప్రత్యేకం
అక్టోబర్ 2న వార్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిలో చంద్రుడు భూమికి దూరంగా ఉంటాడు. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వెళతాడు. అందువల్ల సూర్య కాంతి భూమిని పూర్తిగా చేరలేదు. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. అందువల్ల ఈ సూర్యగ్రహణం అగ్ని వలయంలా కనిపిస్తుంది. రాత్రిపూట సూర్యగ్రహణం మెరుస్తున్న ఉంగరంలా కనిపిస్తుంది. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.
సూర్యగ్రహణం, సూతక్ కాలం ఎప్పుడు?
నాసా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ గ్రహణం దక్షిణ అమెరికా, అంటార్కిటికాలో సంభవిస్తుంది. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికాలో కూడా కనిపిస్తుంది. US స్థానిక కాలమానం ప్రకారం పాక్షిక గ్రహణం ఉదయం 11:42 గంటలకు సూర్యునికి ఎదురుగా చంద్రుడు వెళ్ళినప్పుడు ప్రారంభమవుతుంది. దీని తరువాత దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో మధ్యాహ్నం 12:50 గంటలకు వార్షిక సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ సాయంత్రం 4:39 గంటలకు అట్లాంటిక్ మహాసముద్రంలో ముగుస్తుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో సాయంత్రం 5:47 గంటలకు సూర్యగ్రహణం ముగుస్తుంది. ఇది భారత్ లో కనిపించకపోవడం వల్ల సూతక్ కాలం పరిగణించరు. దీని ప్రభావం కూడా ఎవరి మీద ఉండదు.
ఈ రాశులకు శుభకరం
మేషం, మిథునం, సింహం, కన్యా రాశుల వారికి సూర్య గ్రహణం అదృష్టాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఆందోళనలు తొలగిపోతాయి. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అనువైన సమయం. క్రయ విక్రయాలలో లాభాలు ఉంటాయి.
ఆస్తి, వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలు ఉంటాయి. రోజువారీ పనులు ప్రయోజనకరంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఇది చాలా మంచి సమయం. పాత మిత్రులను కలుసుకుంటారు. కొన్ని శుభవార్తలు అందుతాయి.