తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuaman Jayanti 2024: మీ రాశి ప్రకారం ఈ హనుమంతుడి మంత్రాలు పఠించారంటే ఇక మీకు తిరుగే ఉండదు

Hanuaman jayanti 2024: మీ రాశి ప్రకారం ఈ హనుమంతుడి మంత్రాలు పఠించారంటే ఇక మీకు తిరుగే ఉండదు

Gunti Soundarya HT Telugu

15 April 2024, 17:27 IST

google News
    • Hanuaman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలు పఠించడం వల్ల అంజనేయుడి అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో మీకు ఏ అడ్డంకులు ఉండవు. 
మీ రాశి ప్రకారం హనుమంతుడి ఈ మంత్రాలు పఠించండి
మీ రాశి ప్రకారం హనుమంతుడి ఈ మంత్రాలు పఠించండి (pexels)

మీ రాశి ప్రకారం హనుమంతుడి ఈ మంత్రాలు పఠించండి

Hanuaman jayanti 2024: హనుమంతుడి జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ పండుగను చైత్రమాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు. హనుమంతుడు ఆరోజున సూర్యోదయ సమయంలో జన్మించాడని నమ్ముతారు. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది.

ఆంజనేయుని ఆశీర్వాదాలు పొందాలంటే సూర్యోదయం సమయంలో పూజ చేయడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ధైర్యం, రక్షణ, బలం ఇవ్వమని కోరుకుంటూ హనుమంతుడిని ప్రార్థిస్తారు. హనుమంతుడికి సంబంధించి కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ఆయన ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఏయే రాశి వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారు హనుమాన్ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. "ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్" అనే మంత్రాన్ని పట్టించడం వల్ల ధైర్యం, రక్షణ, హనుమంతుని దీవెనలు లభిస్తాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారు హనుమంతుడికి సంబంధించి “ఓం హం హనుమతే నమః” అని జపించాలి. ఈ మంత్రాన్ని నిత్యం పఠించిన వారికి బలం, ధైర్యం లభిస్తాయి.

మిథున రాశి

మిథున రాశి వారు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఇది హనుమంతునికి అంకితం చేసిన 40 వచనాలు కలిగిన ప్రార్థన. ఈ ప్రార్థన హనుమంతుడిని సద్గుణాలను కీర్తిస్తూ ఉంటుంది. ఆయన ఆశీర్వాదాలు రక్షణ పొందడం కోసం హనుమాన్ చాలీసాను నియమ నిబంధనల ప్రకారం పఠించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించే వారికి ఎటువంటి భయాలు, చెడు శక్తులు దగ్గరకు కూడా రావు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులు హనుమాన్ అష్టకాన్ని జపించాలి. హనుమంతుడుని స్తుతిస్తూ ఎనిమిది శ్లోకాలు ఇందులో ఉంటాయి. ఇది పఠించడం వల్ల భజరంగ్ బలి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి.

సింహ రాశి

సింహ రాశి వారు హనుమాన్ బీజ్ మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీం హనుమతే నమః అని జపించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లో విజయం వరిస్తుంది.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులు హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాలు పఠించాలి. ఇందులో హనుమంతుడి 12 పేర్లతో కూడిన ప్రార్థన ఉంటుంది. ఒక్కో పేరుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిని నిత్యం జపించడం మీ భయాలన్నీ తొలగిపోతాయి.

తులా రాశి

తులా రాశి వారు హనుమాన్ సహస్రనామాన్ని జపించాలి. హనుమంతుని వెయ్యి పేర్లతో కూడిన ప్రార్థన ఇది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు కూడా హనుమంతుని పేర్లతో కూడిన హనుమాన్ ద్వాదశ నామావళి పఠించవచ్చు. ఈ ప్రార్ధన చేయడం వల్ల ధైర్య సాహసాలు, సద్గుణాలు పొందుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులు హనుమాన్ సవాన్ జపించాలి. ఇది చదవడం వల్ల మీకు రక్షణ, ధైర్యం వస్తుంది.

మకర రాశి

మకర రాశి వారు హనుమంతునికి అంకితం చేసిన 44 శ్లోకాలతో కూడిన హనుమాన్ బాహుక్ పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి జాతకులు హనుమాన్ బజరంగ్ బాన్ పఠించాలి. హనుమంతుడిని స్తుతించే శక్తివంతమైన ప్రార్థన ఇది. నిత్యం జపించడం వల్ల హనుమంతుడితో దైవిక సంబంధం ఏర్పడుతుంది.

మీన రాశి

మీన రాశి వారు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ హారతిని జపించాలి.

తదుపరి వ్యాసం