Hanuman Jayanthi 2024: హనుమాన్ జయంతి ఎప్పుడు? ఆ పండుగను ఎందుకు నిర్వహించుకుంటాం?
Hanuman Jayanthi 2024: హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటాం. మొదటి హనుమాన్ జయంతిని అంజనీమాత గర్భం నుండి హనుమంతుడు జన్మించిన రోజున నిర్వహించుకుంటాం. రెండోవది సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజు. హనుమాన్ జయంతికి హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
(1 / 5)
హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటాం. ఒకటి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు వస్తే, మరొకటి కార్తీక మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రోజున వస్తుంది. మొదటి హనుమాన్ జయంతిని ఆ రోజున అంజనీమాత గర్భం నుండి హనుమంతుడు జన్మించిన సందర్భంగా నిర్వహించుకుంటారు. దీపావళికి ఒక రోజు ముందు రెండో జయంతి నిర్వహించుకుంటాం. హనుమంతుని అచంచల భక్తిని చూసి సీతాదేశి అతడిని చిరంజీవిగా ఉండమని దీవించిన రోజు.
(2 / 5)
హనుమాన్ జయంతి రోజున భక్తులు హనుమంతుడిని కుంకుమ, ఎరుపు వస్త్రాలు, పూల మాలలు, గులాబీలు, లడ్డూలు, హల్వా, అరటిపండ్లతో పూజిస్తారు. ఊరేగింపులు, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. (AFP)
(3 / 5)
ఒక కథ ప్రకారం, హనుమంతుడు తన బాల్యంలో పర్వతాలు దాటి ఆకాశంలోకి ఎగిరి, సూర్యుడిని ఒక పండుగా భావించి తినడానికి ప్రయత్నిస్తాడు. అశుభ గ్రహమైన రాహువు సూర్యగ్రహణం కోసం సూర్యుడి వైపు వెళ్తుండగా హనుమంతుడిని అడ్డుకుంటుంది.
(4 / 5)
రాహువుతో హనుమంతుడు తలపడతాడు. రాహువు దేవతల రాజు అయిన ఇంద్రుని సహాయం కోరుతాడు. సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు. దీంతో హనుమంతుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. తన కుమారుని పరిస్థితిని తెలుసుకున్న వాయుదేవుడు కోపగించుకొని లోకంలో సమస్యలు సృష్టిస్తాడు. చివరకు దేవతలు తమ తప్పును గ్రహించి హనుమంతుడిని పునరుజ్జీవింపజేసి అతనికి అనేక వరాలు ప్రసాదిస్తారు.
ఇతర గ్యాలరీలు