Hanuman jayanti 2024: హనుమంతుడి ఈ పన్నెండు పేర్లు నిత్యం పలికారంటే మిమ్మల్ని ఏ సమస్య దరిచేరదు
Hanuman jayanti 2024: జైశ్రీరామ్ అనే పదాలు పలికితే చాలు హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముడిని ఆరాధించే వారికి మీద ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి.
Hanuman jayanti 2024: ఆంజనేయుడికి శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తి ఉంది. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హనుమాన్ జయంతి కూడా ఒకటి. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు.
హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ఆయన ద్వాదశ నామ స్తోత్రాలు అని పిలవబడే 12 నామాలను జపించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వీటిని నిత్యం జపించడం వల్ల ఆంజనేయ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. హనుమంతుడికి ఉన్న పన్నెండు పేర్లు ఏంటి, వాటిని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
హనుమాన్
హనుమాన్ అంటే వికృతమైన దవడతో ఉన్నవాడు అని అర్థం. సూర్యుడిని చూసి పండిన మామిడిగా భావించి దాన్ని మింగడానికి ప్రయత్నించిన చిన్ననాటి సంఘటనను ఈ పేరు సూచిస్తుంది. అమాయకత్వాన్ని ప్రస్ఫుటిస్తుంది.
ఆంజనేయ
హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. అంజనేయుడు అంటే అంజనీపుత్రుడు అని అర్థం. అంజనీ దేవి తనకు కొడుకును ప్రసాదించమని శివుడిని ప్రార్థించినప్పుడు దైవిక వరం ఫలితంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే అంజనీ పుత్రుడిని ఆంజనేయుడు అని పిలుస్తారు.
వాయుపుత్ర
వాయుపుత్ర అంటే వాయుదేవుని కుమారుడు. ఈ పేరు హనుమంతుని తండ్రి వాయుదేవుడిని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుని పుట్టుకలో వాయు దేవుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన బలం, చురుకుదనం ఆంజనేయుడికి వచ్చాయని నమ్ముతారు.
మహావీరుడు
మహావీరా అనే పేరు హనుమంతుని అసాధారణమైన శౌర్యం, ధైర్యాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. నిర్భయ స్వభావం, శ్రీరాముని సేవలోని ఆచంచలమైన భక్తిని సూచిస్తుంది. ఆయన మీద భక్తితో లంకాదహనం చేసి మహా వీరుడిగా నిలిచాడు.
జితేంద్రియ
జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించిన వాడని అర్థం. హనుమంతుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కేవలం శ్రీరాముడికి సేవ చేయడంపైనే దృష్టి సారించాడు. అతని అసమానమైన క్రమశిక్షణ, భక్తికి నిదర్శనంగా ఈ పేరుతో పిలుస్తారు.
భక్తిమాన్
హనుమంతుడిని భక్తిమాన్ అని కూడా పిలుస్తారు. శ్రీరాముని పట్ల అతని భక్తి శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. హిందూ పురాణాలలో ఆదర్శ భక్తుడిగా హనుమంతుడిని పిలుస్తారు.
దంతా
దంతా అనే పేరు క్రమశిక్షణతో కూడిన ఇంద్రియాలు కలిగిన వాడని అర్థం. హనుమంతుడి క్రమశిక్షణ స్వభావం, ఇంద్రియాల మీద నియంత్రణ కలిగిన భక్తుడు. అందుకే అతని సద్గుణాలను అనుకరించాలని సూచిస్తూ ఈ పేరుతో పిలుస్తారు.
కపింద్ర
కపింద్ర అంటే కోతుల రాజు అని అర్థం. వానరులలో ఒకడైన హనుమంతుడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని లంకకు నడిపించిన వ్యక్తి హనుమంతుడు. రామాయణంలో కీలకపాత్ర పోషించాడు.
భయ నివారణ
భయాన్ని తొలగించేవాడిగా భయ నివారణగా పేరు గాంచారు. హాని, చెడు ప్రభావాల నుంచి భక్తులను రక్షించడంలో హనుమంతుడిని తలుచుకుంటారు. ఆయన నామాన్ని జపించడం వల్ల భయం పోయి ధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
పవనపుత్ర
హనుమంతుడిని పవనపుత్ర అని కూడా పిలుస్తారు. అంటే ఈ వాయుదేవుని కుమారుడు వాయువుతో సంబంధం కలిగి ఉండటం వల్ల పవనపుత్ర అంటారు. వేగంగా ప్రయాణించి పనులను సమర్థవంతంగా సాధించగల సామర్థ్యాన్ని ఈ పేరు సూచిస్తుంది.
సంకట్ మోచన
సమస్యలను తొలగించేవాడిగా హనుమంతుడిని సంకట్ మోచన అనే పేరుతో కూడా పిలుస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, అడ్డంకులను తొలగించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుడిని పూజిస్తారు. ఈ పేరుని పలకడం వల్ల బలం, పట్టుదల, ధైర్యం వస్తాయని భక్తుల నమ్మకం.
మారుతి
మారుతి అనేది హనుమంతుడికి ఉన్న మరొక పేరు. మారుట్ అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం గాలి. వేగవంతమైన కదలిక, చుదురుకుదనం కలిగి ఉండటం వల్ల హనుమంతుడిని మారుతీగా పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో ఈ 12 నామాలు జపించడం వల్ల మీకు హనుమంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి.