తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sravana Masam 2024: శ్రావణ మాసంలో వీటిని మీ ఇంటికి తీసుకురండి.. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి

Sravana masam 2024: శ్రావణ మాసంలో వీటిని మీ ఇంటికి తీసుకురండి.. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి

Gunti Soundarya HT Telugu

02 August 2024, 16:53 IST

google News
    • Sravana masam 2024: మహా దేవుడికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ సమయంలో శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. 
శ్రావణ మాసంలో కొనుగోలు చేయాల్సినవి ఇవే
శ్రావణ మాసంలో కొనుగోలు చేయాల్సినవి ఇవే (pinterest)

శ్రావణ మాసంలో కొనుగోలు చేయాల్సినవి ఇవే

Sravana masam 2024: ఆగస్ట్ 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. శివునికి అంకితం చేయబడిన ఈ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరంగా చెబుతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. పరమశివుడు, పార్వతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. శ్రావణ మాసం ముగిసేలోపు మీరు తప్పకుండా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులను తెలుసుకోండి.

రుద్రాక్ష

శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భభించింది రుద్రాక్ష. శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. సావన్‌లో రుద్రాక్షను కొనుగోలు చేయడం కెరీర్‌లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు. వీటిని మెడలో ధరించడం లేదా మంత్రాలు జపించేటప్పుడు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు.

శివలింగం

పరమేశ్వరుడిని లింగ రూపంలోనే కొలుస్తారు. శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు. ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి. ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్టించాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది.

త్రిశూలం

శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది. పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా మంచిది. మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి, రాగి, బంగారంతో తయారు చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది.

వెండి కంకణం

శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.

ఢమరుకం

దేవదేవుడైన మహాదేవునికి ఢమరుకం చాలా ప్రియమైనది. త్రిశూలానికి ఈ ఢమరుకం ఉంటుంది. శ్రావణ మాసంలో ఢమరుకం కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని, ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు.

శమీ వృక్షం

శివుని పూజలో శమీ ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ శ్రావణ మాసంలో మీరు శమీ మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు. శమీ వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు.

జీవితంలోని బాధలు తొలగిపోయి సంపద, సంతోషం పెరిగేందుకు మరికొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలి. ఈ శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులు ముందే తొలగించండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుంది.

విరిగిన విగ్రహాలు

విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజ గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే శ్రావణ మాసం రావడానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయడం మంచిది.

పని చేయని గడియారం

వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు చెడిపోయిన, పగిలిపోయిన గడియారం ఉండకూడదు. ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది. అందుకే వీటిని తొలగించడం మంచిది. లేదంటే పురోగతిని ఆపివేస్తుంది.

బూట్లు, చెప్పు

పాతవి, తెగిపోయిన బూట్లు, చెప్పులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయాలి.

చిరిగిన పుస్తకాలు

చిరిగిన పుస్తకాలు, చెదలు పట్టిన పాత మత గ్రంథాలు ఇంట్లో ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి. వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

తదుపరి వ్యాసం