Vastu tips for ornaments: బంగారమే కాదు ఈ నగలు వాస్తు ప్రకారమే పెట్టాలి.. లేదంటే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది
ఇప్పుడు చాలా మంది బంగారు నగల కంటే ఇమిటేషన్ జ్యూయలరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటిని సరైన దిశలో పెట్టకపోతే నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుందట.
Vastu tips for ornaments: ప్రతిరోజు బంగారు ఆభరణాలు వేసుకోవడం, తీసుకోవడం అంటే చాలా కష్టం. అందుకే ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ జ్యూయలరీకి మొగ్గు చూపుతున్నారు. ఈరోజుల్లో బంగారం నగల కంటే రకరకాల మోడల్స్ లో లభించే ఇమిటేషన్ ఆభరణాలు ధరించడమే ట్రెండ్ గా మారిపోయింది.
తక్కువ ధరకే ఇవి లభించడం వేలాది స్టైల్స్, డిజైన్స్ అందుబాటులో ఉండడం అందుకు కారణం అవ్వచ్చు. వీటిని ధరించడం వల్ల చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. వేసుకున్న డ్రెస్ కి అనుగుణంగా సరిపడా నగలు తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. అందుకే ఎక్కువగా మహిళలు ఇమిటేషన్ జ్యూయలరీ ధరించేందుకే ఇష్టపడుతున్నారు. అది మాత్రమే కాకుండా ఇవి దొంగలు ఎత్తుకెళ్తారనే భయం కూడా ఉండదు.
మనం ధరించే వస్తువుల్లో మన శక్తి దాగి ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉంచడం చాలా ముఖ్యం. కృత్రిమ ఆభరణాల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. బంగారు ఆభరణాలు ఎంత భద్రంగా దాచుకుంటారో అలాగే కృత్రిమ ఆభరణాలు కూడా సరైన విధంగా భద్రపరుచుకోవాలి. వాస్తు ప్రకారం వాటిని సరైన దిశలో ఉంచుకోవాలి. అప్పుడే ప్రతికూలతలు ఎదురుకాకుండా ఉంటాయి. ఇమిటేషన్ నగలను ఎలా ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయో పండితులు సూచిస్తున్నారు.
ఈ దిశలో పెట్టుకోవాలి
బంగారం ఆభరణాలను అయితే ఖరీదు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇమిటేషన్ జ్యూయలరీని నిర్లక్ష్యంగా ఎక్కడంటే అక్కడ ఉంచుతారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. వీటిని భద్రపరుచుకునేటప్పుడు దిశ గుర్తుంచుకోవాలి. ఇవి ఖరీదైనవి ఎక్కువ కాలం ధరించాలి అనుకుంటే వాటిని దక్షిణ దిశలో ఉంచడం చాలా మంచిది. అలాగే కృత్రిమ ఆభరణాలు చౌకగా ఉన్నవి రోజుకొకసారి మార్చుకునేవి అయితే వాటిని వాయువ్య దిశలో భద్రపరుచుకోవాలి. వీటిని అల్మరాలో ఉంచేటప్పుడు వాయువ్యం లేదా ఉత్తరం వైపున ఉంచుకోవడం మంచిది. ఈ విధంగా ఇమిటేషన్ జ్యూయలరీని భద్రపరుచుకున్నప్పుడు సానుకూల శక్తి ఉంటుంది .
బంగారు నగలు ఏ దిశలో ఉంచాలి?
ఎన్ని ఉన్నా బంగారానికి ఉన్న ప్రత్యేకత దేనికి ఉండదు. మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువగానే ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు, మరే ఇతర ముఖ్యమైన సందర్భం అయినా సరే బంగారం ఆభరణాలు కొనడం అలవాటుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులను బట్టి బంగారు వస్తువులు కొనుక్కుంటారు. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లేనని భావిస్తారు. హిందూ ధర్మశాస్త్రంలో బంగారాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బంగారు నగలకు కూడా వాస్తు ఉంటుంది. వీటినే వాస్తు ప్రకారం భద్రపరచుకోకపోతే ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో బంగారాన్ని ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అలాగే ఇంటి వాయువ్య దిశలో పొరపాటున కూడా పెట్టకూడదు. ఈ దిశలో బంగారాన్ని భద్రపరిస్తే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి.
నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు బంగారు నగలు ధరించకూడదు. బంగారు వస్తువులు నిల్వచేసే గది, అల్మరా ఏదైనా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే బంగారు ఆభరణాలు ఎప్పుడూ మురికిగా సబ్బు పేరుకుపోయి ఉండకూడదు. ఎప్పుడు అవి శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఇంట్లో సంపద, శ్రేయస్సు ఉంటుంది. దక్షిణ దిశలో కూడా బంగారు ఆభరణాలు పెట్టుకోవచ్చు. ఇది దిశలో బంగారాన్ని పెట్టడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. సరైన దిశలో బంగారం లేకపోతే ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అప్పుల సమస్యలు ఎక్కువవుతాయి.
టాపిక్