Vastu tips for money: వాస్తు దోషాలు తొలగి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ఈ పనులు చేయండి
Vastu tips for money: వాస్తు శాస్త్రంలో ప్రకారం కొన్ని తప్పులు నివారించడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. ఇంటికి ఆనందం, శ్రేయస్సు, దీవెనలు వస్తాయి. అందుకు ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.
Vastu tips for money: చాలా సార్లు మనం తెలిసి తెలియకుండా చేసే పనులు వాస్తు దోషాలను కలిగిస్తాయి. వాటి వల్ల ఆర్థిక సమస్యలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ సౌకర్యాలతో నిండిన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.
డబ్బు సంపాదన కోసం అందరూ నిరంతరం కష్టపడతారు. అయితే డబ్బు సంపాదించడంలో కొంతమంది విజయం సాధిస్తారు. మరికొందరు కష్టపడినా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించలేరు. శాంతి, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ వాస్తు దోషాల కారణంగా వ్యక్తి ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు దోషం ఉంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. వ్యక్తి కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు తెచ్చే కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను తెలుసుకోండి.
ఈశాన్యంలో బరువు వద్దు
ఇంట్లో నిత్యం ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే అందుకు వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు మైగ్రేన్ నొప్పి మన ఇంటి ఈశాన్య దిశకు సంబంధించినది. ఈ దిశలో ఏదైనా భారీ నిర్మాణాలు ఉంటే అది మెట్లు, దుకాణం, టాయిలెట్, వంటగది కావచ్చు. అప్పుడు అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలన్నింటినీ ఇక్కడి నుండి తీసివేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నీటితో నిండిన రాగి, ఇత్తడి లేదా వెండి కలశం ఉంచండి. ఈ ప్రదేశంలో గంగాజలం ఉంచండి. తులసి మొక్కను నాటండి. స్థలాన్ని శుభ్రంగా, బరువు ఉండకుండా చూసుకోవాలి.
డబ్బు నిలవాలంటే..
ఇంట్లో మూడు తలుపులు ఎప్పుడూ వరుసగా ఉండకూడదు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండలేదు. ఎంత సంపాదించిన కూడా డబ్బులు నిలవవు. ఏదో ఒక రూపంలో చేతికి అందిన డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది.
మెయిన్ గేట్ డోర్‌పై విండ్ చైమ్‌ను అమర్చండి. తలుపు మీద మూడు క్రిస్టల్ బాల్స్ ఏర్పాటు చేయాలి. రెండు మూలలో పెడితే ఒకటి మాత్రం తలుపు మధ్యలో పెట్టాలి. వీలైతే మెయిన్ గేట్ తలుపు మూసి ఉంచి, ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే తెరవండి.
పూజ గది శుభ్రం
ఇంట్లోని పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగిలిన విగ్రహాలు, చినిగిపోయిన దేవతల చిత్రపటాలు, ఎండిపోయిన పూలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు పూజ చేసి దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. లేకపోతే దేవతలు అసంతృప్తి చెందుతారు. ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇంట్లోని అద్దాలు, కిటికీలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి లేకుంటే అది డబ్బు సమస్యలను సృష్టించవచ్చు. గోడ గడియారం మురికిగా ఉండటం, సాలెపురుగు గూళ్ళు ఉన్నట్టయితే వెంటనే వాటిని శుభ్రం చేయండి. ఇది ప్రతికూల విషయాలను ఆకర్షిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్