Bel patra: శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఈ పనులు చేయకండి, నియమాలు తెలుసుకోండి-do not do this while offering belpatra on shivling know the rules ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bel Patra: శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఈ పనులు చేయకండి, నియమాలు తెలుసుకోండి

Bel patra: శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఈ పనులు చేయకండి, నియమాలు తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Jul 29, 2024 10:00 AM IST

Bel patra: శివుని ఆరాధనకు శ్రావణ మాసం, సోమవారం చాలా పవిత్రమైనది. శ్రావణ మాసంలో శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు.

శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించేందుకు నియమాలు
శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించేందుకు నియమాలు

Bel patra: శ్రావణ మాసం ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో సోమవారం ఉపవాసం పాటించడం, శివలింగంపై నీరు, బిల్వ పత్రం, పచ్చి పాలు, భంగ్, శమీ ఆకులతో  సహా అనేక వస్తువులను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.  

yearly horoscope entry point

ఇది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తమైన మార్గం. భక్తులకు ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముతారు. బిల్వ పత్రం శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ పత్రాలు సమర్పించకుండా శివుని పూజ అసంపూర్తిగా ఉంటుందని భావిస్తారు. శివారాధన సమయంలో ప్రతిరోజూ శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా వ్యక్తి అన్ని దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం కలిగి ఉంటాడని చెబుతారు. అయితే శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. శివలింగంపై బిల్వ పత్రాలు  సమర్పించేందుకు నియమాలను తెలుసుకుందాం.

ఈ నియమాలు తప్పనిసరి 

మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాన్ని ఎల్లప్పుడూ శివలింగంపై సమర్పించాలి.

బిల్వపత్రాన్ని అందిస్తున్నప్పుడు దాని ఆకులను కత్తిరించకూడదు లేదా నలిగిపోకూడదు అని గుర్తుంచుకోండి.

శివలింగంపై 1, 5, 11 లేదా 21 బిల్వ ఆకులను సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

బిల్వ పత్రాలు సరైన సమయంలో అందుబాటులో లేని పక్షంలో గతంలో శివలింగంపై సమర్పించిన వాటిని శుభ్రంగా కడిగి మళ్లీ శివలింగంపై సమర్పించవచ్చు.

అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, సోమవారాల్లో బిల్వ పత్రాన్ని తీయకూడదు. ఈ తేదీ ప్రారంభంలో, ముగింపు సమయంలో బిల్వ దళాలు విచ్ఛిన్నం చేయడం మానుకోండి.

శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించే ముందు దానిని నీటితో పూర్తిగా శుభ్రం చేయండి.

శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి, ప్రదోషం వ్రతం,  సోమవారం రోజున శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించడం చాలా శ్రేయస్కరం.

ముందుగా శివలింగానికి నీరు సమర్పించండి. దీని తరువాత బిల్వ పత్రం మృదువైన భాగాన్ని శివలింగంపై సమర్పిస్తారు.

దీనితో పాటు శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు శివునికి చెందిన 'ఓం నమః శివాయ' అనే బీజ్ మంత్రాన్ని జపించండి.

బిల్వపత్రం సమర్పించడం వల్ల ప్రయోజనాలు 

బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు. పాపాలు నశిస్తాయి, కోరికలు తీరతాయి. శ్రావణ మాసంలో మహా దేవుడికి బిల్వ దళాలు సమర్పించడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయి. 

స్కంద పురాణం ప్రకారం బిల్వపత్రం పార్వతీ దేవి చెమట చుక్క నుంచి ఉద్భవించిందని చెబుతారు.  ఈ చెట్టు వేరులో గిరిజా దేవి, నారలో మహేశ్వరి, పార్వతీ దేవి ఆకుల్లో ఉందని నమ్ముతారు. కాత్యాయనీ, గౌరీ దేవి రూపం బిల్వ పండులో ఉందని అంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించలేని వాళ్ళు బిల్వ వృక్షం మూలంలో నీరు పోసి పూజ చేస్తే పుణ్య ఫలం దక్కుతుందని చెబుతారు. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner