Pancha mukhi rudraksha: పంచముఖి రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు? ఇది ధరించేందుకు పాటించాల్సిన నియమాలు ఏంటి?-what are benefits and rules to wear pancha mukhi rudraksha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pancha Mukhi Rudraksha: పంచముఖి రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు? ఇది ధరించేందుకు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Pancha mukhi rudraksha: పంచముఖి రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు? ఇది ధరించేందుకు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jun 01, 2024 02:00 PM IST

Pancha mukhi rudraksha: పంచముఖి రుద్రాక్ష మాల ఎందుకు ధరిస్తారు. ఈ మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇది ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

పంచముఖి రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు?
పంచముఖి రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు? (pinterest )

Pancha mukhi rudraksha: రుద్రాక్షలు దైవిక శక్తికి ప్రతిరూపాలు. ఇవి శక్తివంతమైన శుభప్రదమైన చిహ్నాలుగా పరిగణిస్తారు. సంపూర్ణ శ్రేయస్సు, అంతర్గత పరివర్తనకు ఇవి మార్గాన్ని చూపుతాయి. అందుకే చాలా మంది రుద్రాక్షలు ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఈ రుద్రాక్షలు ఎప్పుడంటే అప్పుడు ధరించకూడదు. వీటిని ధరించేందుకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

శివుడి స్వరూపంగా రుద్రాక్షలను భావిస్తారు. అందుకే తపస్సు, ధ్యానం వంటివి చేసేటప్పుడు రుద్రాక్ష జపమాల తప్పనిసరిగా ఉంటుంది. రుద్రాక్షలు అనేక రకాలు ఉన్నాయి. ఈరోజు మనం పంచముఖి రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. పంచముఖి రుద్రాక్ష ఐదు సహజ భాగాలు లేదా కోణాలతో కూడిన దైవీక పూస. ఇది అత్యంత సాధారణమైన, విస్తృతంగా లభించే రుద్రాక్ష రకం.

రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

పంచముఖి రుద్రాక్ష ఆధ్యాత్మిక వృద్ధిని మెరుగుపరుస్తుంది. ధ్యాన అభ్యాసాలలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది ధరించేవారు అంతర్గత మనసుతో బంధం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందుతారు. స్వీయ సాక్షాత్కారాన్ని ప్రోత్సహిస్తుంది.

అడ్డంకులను నాశనం చేసే కాలాగ్ని రుద్రుడుగా శివుని రూపంతో ఈ రుద్రాక్షలు సంబంధం కలిగి ఉంటాయి. పంచముఖి రుద్రాక్ష ఇది ధరించిన వారికి ఏవైనా పనుల్లో వచ్చే అడ్డంకులు సవాళ్లు తొలగిస్తుందని నమ్ముతారు. ధైర్యం స్థితి స్థాపకత నిశ్చయాన్ని ప్రసాదిస్తుంది. ఇది ధరించిన వారికి ఎటువంటి అవరోధాలు ఉండవు. వాటిని సులభంగా అధిగమించే శక్తిని ఈ రుద్రాక్ష ఇస్తుంది.

పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ప్రశాంతత లభిస్తుంది. మానసిక ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. అంతర్గత శాంతిని పెంపొందిస్తుంది. భావోద్వేగాల సమతుల్యతను కాపాడుతుంది. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

పురాతన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల శరీరంపై చికిత్స ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థ, శ్వాస కోసం సంబంధిత రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పంచముఖి రుద్రాక్ష మెరుగైన ఏకాగ్రతను ఇస్తుంది. మానసిక స్పష్టతను పెంపొందించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది మూడవ కన్నుగా పిలిచే అజ్ఞా చక్రాన్ని ప్రేరేపిస్తుంది. తెలివి, అంతర్ దృష్టిని పదును పెడుతుంది.

పంచముఖి రుద్రాక్షను ధరించేందుకు నియమాలు

మొదటిసారి పంచముఖి రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు అందుకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. శాస్త్రాల ప్రకారం పూజ చేయాలి. పూజారి వేదమంత్రాలు చదువుతూ ఆచారాలతో దానిని శక్తివంతం చేయాలి. ఈ ప్రక్రియ పూసల శక్తిని పెంచుతుంది. దానిని ధరించిన వారి శక్తి క్షేత్రంతో సమలేఖనం చేస్తుంది.

పంచముఖి రుద్రాక్షను శరీరానికి చర్మానికి తాకే విధంగా ధరించాలి. దీన్ని లాకెట్, బ్రాస్లెట్ గా కూడా కట్టుకోవచ్చు. జపమాలగా కూడా ఉపయోగించుకోవచ్చు.

రుద్రాక్ష పూస స్వచ్ఛత సమర్థతను కాపాడుకోవడం కోసం దానిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము ధూళి కాలుష్యం లేకుండా ఉంచుకోవడం చాలా అవసరం. మెత్తటి వస్త్రంతో క్రమం తప్పకుండా తుడుచుకోవాలి. కఠినమైన రసాయనాలు అధిక తేమకు గురికాకుండా చూసుకోవాలి.

ఉద్దేశం ముఖ్యం

సరైన ప్రయోజనాలు పొందడం కోసం పంచముఖి రుద్రాక్షను క్రమం తప్పకుండా ధరించాలి. ముఖ్యంగా ధ్యానం ప్రార్థన చేసేటప్పుడు దీన్ని ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం గౌరవప్రదంగా భావిస్తారు. ఇలా చేస్తే దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి.

పంచముఖి రుద్రాక్ష ఎందుకు ధరించాలని అనుకుంటున్నారనే దాని గురించి స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. దీన్ని ఒక ఫ్యాషన్ గా ధరించకూడదు. ఆధ్యాత్మిక లక్ష్యాలు స్వస్థత కోసం దీన్ని ధరించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు .వ్యక్తిగత ఎదుగుదలకు అనుగుణంగా దాని శక్తిని ఉపయోగించుకోవచ్చు.

Whats_app_banner