Kauravas wives: కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఏమయ్యారు?
11 December 2023, 10:03 IST
- Kauravas wives: కురుక్షేత్ర యుద్ధంలో వందమంది కౌరవులు మరణించారు. మరి ఆ తర్వాత వారి భార్యలు ఏమయ్యారో తెలుసా?
కురుక్షేత్ర యుద్ధం
Kauravas wives: పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం మహాభారతం. ప్రతి ప్రశ్నకు మహాభారతంలో సమాధానం ఉంటుంది. ఇందులోని ఎన్నో విషయాలు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంతో మహాభారతం ముగిసిపోయిందని అనుకుంటూ ఉంటారు కానీ ఆ తర్వాత కూడా పాలన కొనసాగింది.
లేటెస్ట్ ఫోటోలు
రాజ్యాధికారం చేపట్టిన పాండవులు
కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవులు రాజ్యాధికారం చేపడతారు. వంద మంది కౌరవులు ఈ యుద్ధంలో మరణిస్తారు. పాండవులు యుద్ధంలో గెలిచారని కౌరవులు చనిపోయిన విషయం దృతరాష్ట్రుడు, గాంధారికి తెలుస్తుంది. వెంటనే మరణించిన తన కుమారులని చూసేందుకు యుద్ధ భూమికి వెళతారు. అక్కడికి శ్రీకృష్ణుడు కూడా వెళతాడు. కొడుకుల మృతదేహాలు చూసిన గాంధారికి చాలా కోపం వస్తుంది. తమ కుమారుల మరణానికి శ్రీకృష్ణుడే కారణమని నిందిస్తుంది. పుత్ర శోకంతో ఉన్న గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది.
ధృతరాష్ట్రుడు, గాంధారీలని చేరదీసిన ధర్మరాజు
యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల భార్యలను పాండవులు చేరదీశారు. ద్రౌపది యుద్ధ వితంతువులతో కూడిన మహిళా మండలి ఏర్పాటు చేస్తుంది. ఈ మండలి ఇంటి యాజమానిని కోల్పోయిన మహిళలకు అండగా నిలిచింది. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన పని అవకాశాలు అందిస్తూ వారి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకునేలా ద్రౌపది చూసుకుంది.
కౌరవుల భార్యలు ఏమయ్యారంటే
కౌరవుల భార్యలకి పాండవులు ఎంతో మర్యాద ఇచ్చారు. ద్రౌపది ఏర్పాటు చేసిన మండలిలో, పాండవుల రాజ భవనంలో కౌరవుల భార్యలకి గౌరవ ప్రదమైన పదవులు ఇచ్చారు. కర్ణుడి భార్యని పాండవులు గౌరవంగా చూశారు. ఆమె కొడుకుకి అర్జునుడు స్వయంగా ధనుర్విద్య నేర్పించాడు. ధుర్యోధనుడి భార్య ఏమైంది అనే విషయం ఎవరికీ తెలియదు. ఆమెకి ఒక లక్ష్మణ్, లక్ష్మణ అనే కుమార్తె ఉన్నారు. దుర్యోధనుడి కుమార్తెని సంభవుడు ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు.
అరణ్య వాసానికి ధృతరాష్ట్రుడు, గాంధారి
కౌరవులు మరణించడంతో ధర్మరాజు తన పెదనాన్న, పెద్దమ్మ అయిన దృతరాష్ట్రుడు, గాంధారి బాధ్యతలు తీసుకున్నాడు. రాజ్యానికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేశాడు. ధృతరాష్ట్రుడు కూడా పాండవుల పట్ల ప్రేమాభిమానాలు చూపించారు. కుమారులు లేరనే కొరత రాకుండా ధర్మరాజు వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. తమకి ఇచ్చిన గౌరవమే ధృతరాష్ట్రుడు, గాంధారికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు. ధర్మరాజు గొప్పతనం చూసి ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపడతాడు.
అలా దాదాపు 15 సంవత్సరాలు గడిచింది. తన వల్లే తన కుమారులు చెడు మార్గంలో నడిచి చివరికి యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయారని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తమకి ముసలితనం వచ్చిందని ఎక్కువ రోజులు బతకము అందుకే అరణ్య వాసానికి వెళ్తామని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో చెప్తాడు. క్షత్రియుడు యుద్ధభూమిలో మరణించాలి లేదంటే తపస్సు చేసి తనువు చాలించాలి. తమకి రెండో మార్గమే శరణ్యమని చెప్తాడు. వాళ్ళు అడవికి వెళ్లేందుకు మొదట ధర్మారాజు అంగీకరించడు. కానీ వ్యాసుడు చెప్పడంతో అంగీకరిస్తాడు.
వ్యాసుడు అద్భుతం.. కౌరవులని చేరుకున్న భార్యలు
ధృతరాష్ట్రుడు, గాంధారి వారితో పాటు పాండవుల తల్లి కుంతీ దేవి కూడా అరణ్య వాసం చేసేందుకు వెళ్తుంది. కొన్ని రోజులకి వాళ్ళు మరణిస్తారు. వేద వ్యాసుడు ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారిని తన శక్తితో ఒక రోజు తిరిగి తీసుకురాగలిగాడు. వారంతా తమ తల్లిదండ్రులు, సోదరులు, కుటుంబ సభ్యులని కలుసుకున్నారు. కౌరవుల భార్యాలకు వ్యాసుడు వరం ఇస్తాడు. భగీరథ నదిలో ఎవరైతే స్నానమాచరిస్తారో వాళ్ళు తమ భర్తలని చేరతారని చెబుతాడు. వ్యాసుడు చెప్పినట్టుగానే కౌరవుల భార్యలు నదిలో స్నానం ఆచరించి తమ భర్తల వద్దకు చేరుకున్నారు.