Holika dahanam: 700 ఏళ్ల తర్వాత 9 శుభ యోగాలతో హోలికా దహనం.. ఈ యోగాల ప్రభావం ఎలా ఉంటుందంటే..
23 March 2024, 17:14 IST
- Holika dahanam: దాదాపు 700 ఏళ్ల తర్వాత హోలికా దహనం రోజు తొమ్మిది శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వీటి ఫలితంగా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఏ యోగం ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
హోలికా దహనం రోజు 9 శుభయోగాలు
Holika dahanam: ఈ సంవత్సరం హోలికా దహనం మార్చి 24 అంటే రేపు జరుపుకోనున్నారు. మరుసటి రోజు మార్చి 25న హోలీ జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది భద్ర కాలం రాత్రి 10:50 గంటల వరకు ఉంటుంది. నివసిస్తున్న ప్రదేశానికి అనుగుణంగాH ఈ సమయంలో కొద్దిగా అటు ఇటు మార్పులు ఉండొచ్చు.
భద్ర కాలం ముగిసిన తర్వాతే హోలికా దహనం నిర్వహిస్తారు. ఈ ఏడాది హోలీ నాడు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే దీని ప్రభావం భారత్ మీద లేకపోవడం వల్ల హోలీ వేడుకలపై ఎటువంటి ప్రభావం చూపదు. జ్యోతిష్యులు చెప్పే దాని ప్రకారం హోలికా దహనం భద్రకాలం ముగిసిన తర్వాతే నిర్వహించాలి. మార్చి 25 సూర్యోదయ సమయం వరకు హోలికా దహనం నిర్వహించుకోవచ్చు.
ఈ ఏడాది హోలికా దహనం తొమ్మిది శుభ యోగాలతో వచ్చింది. గత 700 సంవత్సరాలలో ఇటువంటి శుభకరమైన యాదృశ్చికం జరగలేదని పండితులు చెబుతున్నారు. హోలికా దహనం రోజును ఏర్పడే శుభయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. తొమ్మిది శుభ యోగాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం.
సర్వార్థ సిద్ధి యోగం: ఈ యోగం ప్రభావం వల్ల చేసే పనులన్నింటిలోనూ విజయం లభిస్తుంది.
లక్ష్మీ యోగం: లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ యోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
పర్వత యోగం: ఈ యోగం మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తుంది. రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులకు ఈ యోగం ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది.
కేదార్ యోగం: కీర్తి, వైభవం, పేరు, ప్రతిష్టలు, శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ యోగం కూడా అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది.
వరిష్ఠ యోగం: ఈ యోగం సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుంది. అదృష్టం, విజయం, కీర్తిని తీసుకొస్తుంది.
అమల యోగం: ఈ యోగం వ్యక్తిగత, వృత్తిపరమైన ఆనందం, విజయాన్ని ఇస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి యోగం భారీ లాభాలను తీసుకొస్తుంది.
ఉభయచారి: ఇది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక పరమైన ప్రయోజనాలను ఇస్తుంది.
సరళయోగం: శత్రువులపై విజయం సాధించడంలో సరళయోగం మీకు సహాయపడుతుంది. మీ జాతకంలో సరళయోగం ఉంటే శత్రువులను ఓడిస్తారు. మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
శష మహాపురుష యోగం: శని వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. మీకు దీర్ఘాయువును ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో విజయాన్ని అందిస్తుంది. ఈ యోగం సమయంలో హోలికా దహనం నిర్వహించడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అనేక రకాల సమస్యలు, వ్యాధులు దూరం అవుతాయి. ఈ శుభయోగం శ్రేయస్సు, విజయాలను తీసుకొస్తుంది.
ఆర్థిక పురోగతి
ఏడాది హోలీ సమయంలో దేశం ఆర్థిక రంగంలో పురోగతి ఉంటుందని పండితులు చెప్తున్నారు. పరిశ్రమలు, స్టార్టప్ లు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో భారీ ఎత్తున ఆర్థిక ఒప్పందాలు జరుగుతాయి. మతపరమైన విషయాల్లో వివాదాలు జరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కొంత రాజకీయ అస్థిరత, గందరగోళ పరిస్థితుల్లో నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే దేశంలో వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
హోలికా దహనం నిర్వహించే సమయంలో ఈ మంత్రాలు పఠించడం మంచిది.
హోలికా మంత్రం- ఓం హోలీకై నమః భక్త
ప్రహ్లాద మంత్రం- ఓం ప్రహ్లాద నమః
నరసింహస్వామి మంత్రం- ఓం నృసింహాయ నమః