Holi 2024: హోలీ రోజు చంద్రగ్రహణం రావడం శుభమా? అశుభమా?-holi and lunar eclipse come together is auspicious or not ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi 2024: హోలీ రోజు చంద్రగ్రహణం రావడం శుభమా? అశుభమా?

Holi 2024: హోలీ రోజు చంద్రగ్రహణం రావడం శుభమా? అశుభమా?

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 06:30 PM IST

Holi 2024: సుమారు వందేళ్ల తర్వాత హోలీ రోజు చంద్ర గ్రహణం వచ్చింది. గ్రహణం నీడలో హోలీ రావడం శుభమా? అశుభమా? అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

హోలీరోజు చంద్రగ్రహణం శుభమా? అశుభమా?
హోలీరోజు చంద్రగ్రహణం శుభమా? అశుభమా? (pixabay)

Holi 2024: మార్చి 25వ తేదీ పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత గణితం ఆధారంగా ఫాల్గుణ మాస శుక్లపక్ష పౌర్ణమి హస్తా నక్షత్రము, కన్యారాశియందు కేతుగ్రస్త ఉపచాయ చంద్రగ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ గ్రహణం భారతదేశంలో సంభవించదు. భారత్ లో ఇది కనిపించక పోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చిలకమర్తి తెలిపారు.

పంచాంగరీత్యా 25 మార్చి 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 10.24 నుండి మధ్యాహ్నం 3.02 నిమిషాల మధ్య ఉపచాయ చంద్రగ్రహణం ఉంటుంది. మధ్యాహ్నం 12.44 నిమిషాలకు చంద్రగ్రహణ మధ్యస్థ కాలం ఏర్పడుతుందని ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని చిలకమర్తి తెలిపారు. ఈ గ్రహణం యూరఫ్‌, ఉత్తర, తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు రష్యా ప్రాంతాలలో కనిపిస్తుందని అందువల్ల విదేశాలలో ఈ ప్రాంతాలలో నివసించు భారతీయులు ఆ గ్రహణ నియమాలు పాటించాల్సిందిగా చిలకమర్తి సూచించారు.

కన్యారాశిలో ఏర్పడు ఈ గ్రహణ ప్రభావం వలన రాజకీయ అనిశ్చితి నెలకొంటుంది. కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు జైలు పాలవడం, యుద్ధ వాతావరణం, భయాలు, ఉగ్రవాద దాడులు, వాతావరణ మార్పులు ఏర్పడును. పశ్చిమ దేశాలలో అర్థిక ఇబ్బందులు, సమస్యలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. అకాల వర్షాలు, సునామీ, భూకంపాలు వంటివి ఏర్పడతాయని చిలకమర్తి తెలిపారు. విదేశాలలో ఈ గ్రహణం ఏర్పడుతున్న సమయంలో అక్కడ నివసించేటటువంటి కన్య, మీన రాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సూచించారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner